సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడే జరిగినట్లు నెట్టింట్లో ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు ప్రముఖుల విషయాల్లో జరుగుతుంటాయి.
ఇటీవల వ్యాపార దిగ్గజం రతన్‌టాటాకి అసోం రాష్ట్రం అత్యున్నత పురస్కారమైన అసోం బైభవ్ అవార్డును ప్రకటించిన నేపథ్యంలో నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా 2019లో రతన్ టాటా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ఇప్పుడే జరిగినట్లు పలువురు ఆ పోస్ట్ ను షేర్ చేస్తున్నారు.
టాటాకు అవార్డు రావడంపై ఇన్ స్టాగ్రామ్‌లో అభినందనలు తెలిపిన నెటిజన్ లలో ఓ అమ్మాయి 'కంగ్రాట్స్ ఛోటూ అంటూ కామెంట్ చేసింది. అంతే ఆ కామెంట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరా అమ్మాయి. రతన్ టాటాని అంతమాట అనేసిందేంటీ అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి అసోం బైభవ్ అవార్డ్‌కు ఆ అమ్మాయి చేసిన కామెంట్ కు సంబంధం లేదని కొన్ని రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
2019 అక్టోబర్ నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. అలా ఓపెన్ చేశారో లేదో కేవలం నాలుగు నెలల్లోనే ఆయన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య పదిలక్షల మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో రతన్ టాటా తన ఇన్‌స్టా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ 'నా ఇన్‌స్టా పేజీలో ఫాలోవర్ల సంఖ్య ఒక మిలియన్ మైలురాయిని దాటింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు ఇంత అద్భుతమైన ఆన్‌లైన్ కుటుంబం ఉంటుందని ఊహించలేదు.అందరికి ధన్యవాదాలు. మీతో కలిసి ఈ ప్రయాణం కొనసాగుతుందని ఆశిస్తున్నా అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్‌కు నెటిజన్‌లు రతన్ టాటాను అభినందనలతో ముంచెత్తారు. కానీ రేహాజైన్ అనే అమ్మాయి మాత్రం భిన్నంగా అభినందనలు ఛోటూ అంటూ రిప్లై ఇచ్చింది. ఆ రిప్లైయికి నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. రతన్ టాటా ఆ ట్రోలింగ్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. యువతి కామెంట్‌కు రతన్ స్పందిస్తూ 'మనలోని ప్రతి ఒక్కరిలో ఒక పిల్లవాడు ఉంటాడు. ఆ అమ్మాయిని నిందించకండి. గౌరవంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను అని పేర్కొన్నారు. దాంతో నెటిజన్లు శాంతించారు.
Comments
Please login to add a commentAdd a comment