నా శ‌రీర‌మే నా అందం: ఇలియానా | Viral: Ileana D Cruz is Beautifully Flawed In Latest Instagram photo | Sakshi
Sakshi News home page

‘నా శరీరం అందంగా లేదని అనుకునేదాన్ని’

Published Fri, Oct 2 2020 6:52 PM | Last Updated on Fri, Oct 2 2020 11:19 PM

Viral: Ileana D Cruz is Beautifully Flawed In Latest Instagram photo - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరితోనూ నటించిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చారు. అక్కడ ఆడపదడపా సినిమాల్లో నటించిన గోవా బ్యూటీ. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో ఎక్కువ కనిపించడం లేదు. ప్రస్తుతం అభిషేక్‌ బచ్చన్‌తో క్రైమ్‌ డ్రామా ‘ది బిగ్‌ బుల్‌’ సినిమాలో నటిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ద్వారా మళ్లీ అభిమానులను పలకరించారు. తన శరీర సౌష్టవాన్ని గురించి మొదట దిగులు చెందిన ఈ భామ ప్రస్తుతం అదే శరీరం చూసి మురిసిపోతుంది. దీనికి సంబంధించిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఈ పోస్టులో శరీరాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దుకోవడంలో ఎదుర్కొన్న సొంత అనుభవాలను పంచుకున్నారు. చదవండి: ఇలియానా వెరైటీ లుక్‌

తన శరీరంలో ఎన్నో లోపాలు ఉన్న‌ట్లు బాధ‌ప‌డిన ఇలియానా ఇప్పడు ఆ లోపాలే ఆమెకు అందాలంటూ పేర్కొన్నారు. ‘నా శరీరాకృతిపై ఎప్పుడూ ఆందోళన చెందుతున్నాను. ఎదుటి వారికి ఎలా కన్పిస్తున్నానో అని బాధపపడేదాన్ని. నా థైస్‌ చాలా పెద్దగా ఉంటాయని అనిపించేవి. నా హిప్‌‌ చాలా వెడల్పుగా ఉంటుందని, నా నడుము సన్నగా ఉండేందని అనుకునేదాన్ని, నా వక్షోజాలు చిన్నగా ఉంటాయని, నా పొట్ట అనుకున్నంతా బాగోదని, భుజాలు బలహీనంగా ఉంటాయని అనిపించేది. పెదాలు అందంగా లేవని, నే ఎక్కువ ఎత్తు ఉండనని బాధపడేదాన్ని. అసలు నేను స్మార్ట్‌, పర్‌ఫెక్ట్‌ కాదని అభిప్రాయపడేదాన్ని.’ అని వెల్లడించారు.. (హైదరాబాద్‌లో 10 రోజులపాటు కంగనా)

త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన అందాలే త‌న‌కు అట్రాక్ష‌న్ అని ఇలియానా త‌న పోస్టులో వివ‌రించారు.  ‘నేను ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండాలని అనుకోలేదు. నాలోని   ప్రతి మచ్చను అందంగా భావిస్తున్నాను. నాలోని అన్ని లోపాలను నా సొంత అందంగా మలుచుకున్నాను. ప్రపంచం అందం అని అనుకునే దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి. ఇతరులకు అందంగా అనిపించే దాని కోసం నేనేందుకు మారాలి. నా అందం నాదే. నాకు నేనుగా నిలబడ్డాను’. అంటూ సుదీర్ఘ పోస్టు చేశారు. కాగా ఇలియానా చేసిన ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేగాక ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ప్రేరేపించేలా ఉన్నాయి. అలాగే ఇలియానా షేప్ అంత అట్రాక్టివ్‌గా ఉండ‌ద‌ని కొన్నాళ్ల క్రితం బాడీషేమింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

I’ve always worried about how I looked. I’ve worried my hips are too wide, my thighs too wobbly, my waist not narrow enough, my tummy not flat enough, my boobs not big enough, my butt too big, my arms too jiggly, nose not straight enough, lips not full enough..... I’ve worried that I’m not tall enough, not pretty enough, not funny enough, not smart enough, not “perfect” enough. Not realising I was never meant to be perfect. I was meant to be beautifully flawed. Different. Quirky. Unique. Every scar, every bump, every “flaw” just made me, me. My own kind of beautiful. That’s why I’ve stopped. Stopped trying to conform to the world’s ideals of what’s meant to be beautiful. I’ve stopped trying so hard to fit in. Why should I?? When I was born to stand out. #nophotoshop #nobs 📸 @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement