ఒకప్పడు తెలుగులో టాప్ హీరోయిన్‌గా మెప్పించిన ఇలియానా బాలీవుడ్‌లో కూడా మెప్పించింది. హ్యాపీ ఎండింగ్, రైడ్ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్‌లో కూడా తనకంటూ మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే, సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఇలియానా సుమారు రెండేళ్ల తర్వాత బాలీవుడ్‌లో 'దో ఔర్ దో ప్యార్'తో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో విద్యాబాలన్, ప్రతిక్ గాంధీ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 19న విడుదలైంది. అయితే, తాజాగా ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో నోరా పాత్రలో చాలా బోల్డ్‌గా ఇలియానా మెప్పించింది. షిర్షా గుహా ఠాకూర్తా ఈ చిత్రం ద్వారా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. కానీ, ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 'దో ఔర్ దో ప్యార్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, ఈ చిత్రం హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment