
హైదరాబాద్ : మ్యాగీకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగని చూడటం కాదండోయ్.. బ్యాట్ కు పనిచెప్పడమూ తెలుసు. మ్యాగీ కొట్టిన షాట్ సిక్సర్ వెళ్లడంతో ఆమెను మ్యాచ్ నుంచి తొలగించారు. ఇంతకీ మ్యాగీ ఎవరనుకుంటున్నారా.. టాలీవుడ్ నటి లావణ్యా త్రిపాఠి. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో నటి చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. వేల వ్యూస్, కామెంట్లతో దూసుకెళ్తుంది.
కొందరు చిన్నారులు కలిసి ఓ ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుతున్నారు. నటి లావణ్యా త్రిపాఠి సరదాగా వారి ఆటలో ఎంటరయ్యారు. ఈ క్రమంలో ఓ బాలుడు వేసిన బంతిని లావణ్య భారీ షాట్ ఆడగా అది సిక‍్సర్ అయింది. దీంతో తమకు బంతి లేకుండా చేసిన నటిపై చిన్నారులకు చాలా కోపం వచ్చింది. నీవల్లే మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయిందంటూ లావణ్యను మ్యాచ్ నుంచి తప్పించారట. ఈ విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ఆమె షేర్ చేసుకున్నారు. ఈ పోస్ట్ వ్యూస్, కామెంట్లతో వైరల్ అయింది. అయితే లావణ్య ఆడిన షాట్ ను ఇన్ స్టాగ్రామ్ లో వీక్షించవచ్చు.
Maggie loves to play cricket, and this time she got over active n threw the ball out of the… https://t.co/wVtCENIhHP
— LAVANYA (@Itslavanya) 15 October 2017