
భారత దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో బ్యాట్‌మన్ వరుసపెట్టి రెండుసార్లు ఔట్ అయినా.. ఒప్పుకోడు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయని, మన జీవితంలో ఇలాంటివి ఎక్కడోచోట జరిగిన సందర్భాలు ఉంటాయని ధోని పేర్కొన్నాడు. అంతేకాక సరిగా వెలుతురు లేని కారణంగా బ్యాట్‌మన్ అవుట్ అయినందుకు ధోని సారీ చెప్పాడు. ఈ వీడియో మన దగ్గర లేకపోయుంటే సదరు బ్యాట్‌మన్ అవుట్ అయినా.. అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోడని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోని ప్రస్తుతం సెలవులు తీసుకుని సరదాగా గడుపుతున్నాడు. అంతకుముందు రెండు నెలల పాటు సైన్యంలో సేవలు అందించాడు. డిసెంబర్ 6న వెస్టిండీస్‌తో జరగనున్న సిరీస్‌కు ధోని అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment