లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్ తన ఫ్యాన్స్ పై మరోసారి మండిపడ్డాడు. ఇక వారితో ఏ మాత్రం ఫొటోలకు ఫోజు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. 22 ఏళ్ల ఈ పాటల దిగ్గజం ఇన్ స్టాగ్రమ్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తన అభిమానులు వచ్చి అలా ఫొటోలు దిగుతుంటే తనకు తాను జూలో జంతువులా కనిపిస్తున్నానని చెప్పారు.
ఎక్కడికి వెళ్లినా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అంటూ ఎగబడటం.. వెంటనే ఫొటోల కోసం ఎగబడటం తనకు నచ్చలేదని చెప్పారు. తనను చూసిన వారు కనీసం గుర్తించరని హాయ్ కూడా చెప్పరని.. కేవలం ఫొటోలు మాత్రమే దిగుతారని.. దాంతో తాను జూలో జంతువుగా భావిస్తున్నాని చెప్పారు. అయితే, తన నిర్ణయం అభిమానులకు ఇబ్బంది పెడుతుందని తనకు తెలుసని అయినా తప్పదని చెప్పాడు.
'నాకు నేను జంతువులా కనిపిస్తున్నాను'
Published Thu, May 12 2016 8:28 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM
Advertisement
Advertisement