'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు' | Fans shouldn't idolise me: Justin Bieber | Sakshi
Sakshi News home page

'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు'

Published Fri, Feb 26 2016 8:37 AM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM

'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు'

'తప్పులు చేశా.. నన్ను ఆదర్శంగా తీసుకోవద్దు'

లండన్: పాప్ సింగర్స్ను ఏ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోరాదని హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ అన్నాడు. ముఖ్యంగా తనను ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని, అది ఏ ఒక్కరికి మంచిది కాదని చెప్పారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూలో తనకు స్టార్ డమ్ అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. తనను మరొకరు అనుసరించడం నచ్చదని అన్నాడు.

'నేను నిజంగా జనాలకు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నాపై ఏ మాత్రం నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే ప్రతిసారి నేను మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను. ఇది కొంత ఆందోళనగా అనిపించినా ఈ విషయం చెప్పక తప్పదు. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను ఎవరి సమస్యలను తీర్చగల సమర్థుడిని కాదు. నేను పర్ ఫెక్ట్ కాదు. చాలా తప్పులు చేశాను. నా ఉద్దేశం ప్రకారం మనుషులను పూజించడం అనేది మంచి పద్దతి కాదు' అని బీబర్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement