భారత్‌లో అడుగిడనున్న పాప్‌ కెరటం.. మేలోనే | justin bieber in india on may 10 | Sakshi
Sakshi News home page

భారత్‌లో అడుగిడనున్న పాప్‌ కెరటం.. మేలోనే

Published Wed, Feb 15 2017 7:50 AM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM

భారత్‌లో అడుగిడనున్న పాప్‌ కెరటం.. మేలోనే

భారత్‌లో అడుగిడనున్న పాప్‌ కెరటం.. మేలోనే

న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఓ నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ హాలీవుడ్‌ యువ పాప్‌ సెన్సేషన్‌ సింగర్‌, గ్రామీ అవార్డు విజేత జస్టిన్‌ బీబర్‌ భారత్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ వేసవిలోనే అతడు ఇండియాకు వస్తున్నాడు. అధికారిక కార్యక్రమంలోనే భాగంగా ఈ ఏడాది(2017) మే 10న ముంబయికి వస్తున్నాడు. ప్రపంచ టూర్‌లో భాగంగా ఈ కెనడియన్‌ పాప్‌ స్టార్‌ భారత్‌కు వచ్చి ముంబయిలోని డీవై పాటిల్‌ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నాడు.

ఈ విషయాన్ని వైట్‌ ఫాక్స్‌ ఇండియా ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అతడు ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌, దుబాయ్‌, యునైడెట్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో కూడా ప్రదర్శన ఇవ్వనున్నాడు. ముంబయిలో నిర్వహించనున్న పాప్‌ మ్యూజికల్‌ షోకు ముందస్తుగా ప్రముఖ ఆన్‌లైన్‌ బుకింగ్‌ యాప్‌ బుక్‌ మై షో ద్వారా బుక్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 22 నుంచి టిక్కెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఒక్కో టికెట్‌ ధర రూ.4000 నుంచి ప్రారంభం కానున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement