తన పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న హాలీవుడ్ సింగర్ జస్టిన్ బీబర్. కెనడాకు చెందిన ఈ పాప్ సింగర్ ప్రస్తుతం ఓ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇటీవల తనకు లైమ్ వ్యాధి సోకిందని, అయితే దీనికి చికిత్స తీసుకుంటున్నానని ఆయన తెలిపారు. పాతికేళ్లు వయసున్న జస్టిన్ బీబర్ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చారు. ‘చాలా మందికి తెలియదు. జస్టిన్ బీబర్ ఎందుకు ఇలా తయారయ్యాడని అందరూ అనుకుంటున్నారు. నేను లైమ్ వ్యాధితో బాధపడుతున్నానని వారికి తెలీదు. ఇది నాపై దీర్ఘకాలంగా ప్రభావం చూపింది. ఈ వ్యాధి వల్ల నా చర్మం పూర్తిగా పాడైపోయింది. మెదడు పనితీరు మారింది. ఒంట్లో శక్తి తగ్గి, ఆరోగ్యం క్షీణించిపోయింది’ అని పేర్కొన్నారు.
అయితే చాలా కాలం ఈ జబ్బుతో పోరాడం చేశానని ప్రస్తుతం దీనిని పూర్తిగా అధిగమించడానికి సరైన చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. కాగా లైమ్ వ్యాధి బొర్రెలియా బర్గ్ డార్ఫరి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇక్సోడ్స్ అనే పేను లాంటి పురుగుల (టిక్స్) ద్వారా వ్యాపిస్తుంది. అమెరికా వంటి దేశాల్లో ఎండకాలంలో బాగా వచ్చే ఈ వ్యాధి సోకడం వల్ల చర్మం ఎర్రగా మారి.. దద్దుర్లు ఏర్పడతాయి. అలాగే కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. ఇక ఓ నివేదిక ప్రకారం సుమారు మూడు లక్షల మంది అమెరికన్లు లైమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment