ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు | Sanjay Dutt Daughter Trishala Writes I Love You And Miss You On Instagram | Sakshi
Sakshi News home page

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

Aug 2 2019 5:54 PM | Updated on Aug 2 2019 7:37 PM

Sanjay Dutt Daughter Trishala Writes I Love You And Miss You On Instagram - Sakshi

త్రిషాల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఫొటో

బాలీవుడ్‌ హీరో సంజయ్‌ దత్‌ కుమార్తె త్రిషాల, తన బాయ్‌ఫ్రెండ్‌ మరణించి సరిగ్గా ఒక నెల కావడంతో.. ఆమె దివంగత ప్రియుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. అందులో తన ఇటాలియన్‌ బాయ్‌ఫ్రెండ్‌ ఆమె ఒళ్లో కూర్చొని ఉండగా, చిత్రానికి  ‘ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ’ అనే హ్యష్‌టాగ్‌ జోడించారు. 

సరిగ్గా నెల రోజుల క్రితం, త్రిషాల తన ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఓ భావోద్వేగపూరిత పోస్టు ద్వారా తెలిపిన సంగతి విదితమే. అందులో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ‘నా గుండె పగిలింది. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు, నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నేను జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచంలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావిస్తున్నాను. నీ దాన్ని అయినందుకు ఎంతగానో మురిసిపోయాను. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్‌ యూ. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. నేను ఎల్లప్పుడూ నీ దానినే.. బెల్లా మియా. నిన్నటి కంటే ఎక్కువగా నేడు.. నేటి కంటే రేపు మరింత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు.

ఇటీవలే ఓ వివాహానికి హాజరయిన ఆమె తన ప్రియుడిని మిస్సవుతోన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘ఈ వారాంతంలో నన్ను నేను చిరునవ్వుతో సిద్ధం చేసుకొని నా మిత్రుని సోదరి  వివాహానికి హాజరయ్యాను. తేరుకొవడానికి కొద్దిగా సమయం పడుతుంది,  నా వంతు కృషి చేస్తున్నాను. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను, మిస్ అవుతున్నాను. నేను అతన్ని ఎంతలా ఆరాధించానో, అతను కూడా నన్ను అదే రీతిలో ఆరాధించాడు’ అని ఆమె తెలిపారు.

త్రిషాల సంజయ్ దత్ మొదటి కుమార్తె. 1989లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆమె తల్లి రిచా శర్మ  బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ 1996 లో మరణించించారు. కాగా, సంజయ్‌దత్‌ బయోపిక్ అయిన ‘సంజూ’లో  రిచా శర్మ, త్రిషాల గూర్చి  ప్రస్తావించలేదు. దానిపై చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి. తన తండ్రి సంజయ్‌తో తన సంబంధం చాలా ‘సాధారణమైనది’ అని ఆమె ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ఏఎమ్‌ఏ సెషన్‌లో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement