Trishala
-
అందుకే అతడితో విడిపోయా: హీరో కూతురు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. అయితే అక్కడ తను ఓ వ్యక్తితో సుదీర్ఘ కాలం ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల త్రిశాలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సుదీర్ఘ ఆమె సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన బ్రేకప్ గురించి అడగ్గా.. ఏడేళ్ల తన సుదీర్ఘ రిలేషన్షిప్లో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అంతేగాక తన మాజీ ప్రియుడు తనని మోసం చేసినట్లు కూడా తెలిపారు. ‘నా 7 ఏళ్ల రీలేషన్ ఎందుకు ముగిసిందనే దానిపై నేను ఖచ్చితమైన వివరణ ఇవ్వలేను. అయితే మేము ఇద్దరం ఇష్టంగానే విడిపోయాం. ఎందుకుంటే నా నుంచి విడిపోవడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే మా మధ్య ఎన్నో విభేదాలు, చాలా తేడా ఉంది. అయితే ఇన్నేళ్లు అవి బయట పడలేదు అంతే. ఇక నా జీవితం నుంచి అతడు వెళ్లిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అతడు నా నుంచి విడిపోయేందుకు ఎప్పుడు సిద్దంగా ఉండేవాడు. సంతోషంగా నా నుంచి వెళ్లిపోయినందుకు అతడికి నా అభినందలు’ అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా అతడిని ఆమె ఎంతగానో ప్రేమించినప్పటికి అతడు తనని చాలా చెత్తగా చూసేవాడని చెప్పారు. తను ఏం చేసినా విమర్శించడం, తప్పులు వెతకడం చేసేవావట. చివరికి ఆమె మిత్రులను కలిసిన ఇష్టపడేవాడు కాదని, చివరకు అతని కోసం మిత్రులను కలవడం, వారి సరదగా గడపడం కూడా వదులుకున్నట్లు చెప్పారు. అయితే అతడు ఎప్పటికైనా మారతాడనే ఆశతో అంతకాలం అతడిని భరించానని పేర్కొన్నారు. -
భాయ్‌ఫ్రెండ్ నన్ను ‘చెత్త’లా చూసేవాడు
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిశాలా దత్ అందరికీ తెలిసే ఉంటుంది. సంజయ్‌దత్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాలా. ప్రస్తుతం ఈమె న్యూయార్క్‌లో సైకోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల తండ్రి డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెబుతూ అందులోంచి బయటకు రావడానికి తన సహాయం కూడా తీసుకున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్లో పాల్గొన్నారు త్రిశాలా. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మీ రిలేషన్షిప్లో ఎప్పుడైనా తప్పులు చేశారా అని ఓ వ్యక్తి ఆమెను అడిగాడు. దీనిపై త్రిషాల స్పందిస్తూ.. గతంలో ఓ వ్యక్తితో తను ఎదుర్కొన్న భయంకర అనుభవం, మానసిక వేదన గురించి సుదీర్ఘంగా వెల్లడించారు. దీనికి సమాధానం చెప్పాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలని తెలుపుతూ.. తన అనుభవం ఎదుటివాళ్లకు తప్పులు చేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఎప్పుడూ అందరితో నిజాయితీగా ఉండాలని సూచించారు. చదవండి: మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం ‘కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తితో నేను ‘డేటింగ్’ చేశాను. డేటింగ్ అనే పదాన్ని ఎందుకు కోట్స్‌లో పెట్టానంటే.. నిజానికి నాతో నేనే డేటింగ్ చేశాను. అతనితో కలిసుంటే మంచిదని నేను తనను భాయ్‌ఫ్రెండ్‌గా ఒప్పించా. డేటింగ్ గురించి ఆలోచించమని ఓ వారం టైం ఇచ్చినట్టు గుర్తుంది. అప్పుడు నా మీద నాకు గౌరవం లేదు. నాకు ఎలాంటి హద్దులు లేవు. అయితే కొంతకాలం తర్వాత బాయ్‌ఫ్రెండ్ నన్ను పనికిరాని చెత్తలా చూడటం ప్రారంభించాడు. నేను కేవలం అతడికి ఆ రోజు బాలేదని అనుకునేదాన్ని. రేపైనా బాగుంటాడేమోనని అనుకునేదానిని. కానీ అతనిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. రోజురోజుకీ ఇంకా దిగజారి ప్రవర్తించేవాడు. చదవండి: ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టీజర్ రాబోతుందా! నాకు తెలియకుండా అతడు నెమ్మదిగా నా స్నేహితుల నుంచి నన్ను వేరు చేశాడు. నేను ఎప్పుడు బయటికి వెళ్లినా.. ఇంటికి వచ్చేటపుడు అతనికి మెసేజ్ చేస్తాను. దానికి అతడు ఓ ఎవరైనా ఇంటికి ఆలస్యంగా వస్తారా..? అంటూ ' (వింక్ ఎమోజి) దూషించేవాడు. ఏదో చేయకూడని పని చేసినట్లు నేను ఫీల్ అయ్యేదాన్ని. నన్ను నేను నిరూపించుకోడానికి నా స్నేహితులతో తిరగడం మానేశాను. నేను ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. ఆ తరువాత చాలా కాలం అలా ఉండిపోయాక ఈ సంబంధంలో ఎందుకు ఉండిపోయానని ఆలోచించాను. నన్ను నేను విషపూరిత ప్రవర్తించాను. నాకోసం నేను నిలబడకుండా ఆ వ్యక్తిని నాపై అలా మాట్లాడేందుకు అనుమతిచ్చాను. కానీ తనెంటో, అతని గురించి నాకు బాగా తెలుసు. తన నుంచి దూరం అయ్యాక నా ప్రవర్తనను అంగీకరించి.. సిగ్గు పడ్డా. చాలా విషయాలు నేర్చుకుని ఇప్పుడు మీ ముందు నిలబడ్డా’ అంటూ తన గతం గురించి చెప్పుకొచ్చారు. -
మా నాన్న జీవితం స్ఫూర్తిదాయకం
‘‘మా నాన్నను చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ విషయాన్నీ దాచలేదు. తాను డ్రగ్స్‌కి బానిస అయిన విషయాన్ని ఓపెన్‌గా చెప్పి, అందులోంచి బయటకు రావడానికి సహాయం కూడా కోరారు’’ అంటున్నారు త్రిషాలా దత్... డాటర్ ఆఫ్ సంజయ్ దత్. ఇంకా ఈ విషయం గురించి త్రిషాలా మాట్లాడుతూ – ‘‘గతంలో నా తండ్రి డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. తనకు తానుగా డ్రగ్స్ తీసుకుంటున్నానని ఒప్పుకోవటమే కాకుండా దాన్నుండి బయటపడటానికి సాయం చేయమని అడిగారు. ఈ విషయం చెప్పటానికి నేను సిగ్గుపడటం లేదు. ఒక చెడు అలవాటుకి బానిస అయి, అందులోంచి బయటకు రావడం అనేది చిన్న విషయం కాదు. మానేసే క్రమంలో డ్రగ్స్ తీసుకోకపోయినా ప్రతి రోజూ ఆయన తనతో తాను పోరాడాల్సి వచ్చింది. అందుకే నా తండ్రి జీవితం స్ఫూర్తిదాయకం’’ అన్నారు. ఇటీవల సంజయ్ క్యాన్సర్‌ని జయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ప్యాన్ ఇండియా చిత్రం ‘కేజీఎఫ్–2’లో అధీరా పాత్రలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాల్లో నటిస్తూ యాక్టివ్‌గా ఉన్నారు సంజయ్ దత్. -
ఐ లవ్యూ, ఐ మిస్ యూ: హీరో కూతురు
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిషాల, తన బాయ్‌ఫ్రెండ్ మరణించి సరిగ్గా ఒక నెల కావడంతో.. ఆమె దివంగత ప్రియుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అందులో తన ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్ ఆమె ఒళ్లో కూర్చొని ఉండగా, చిత్రానికి ‘ఐ లవ్యూ, ఐ మిస్ యూ’ అనే హ్యష్‌టాగ్ జోడించారు. సరిగ్గా నెల రోజుల క్రితం, త్రిషాల తన ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక ఓ భావోద్వేగపూరిత పోస్టు ద్వారా తెలిపిన సంగతి విదితమే. అందులో తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశించి ‘నా గుండె పగిలింది. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు, నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నేను జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచంలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావిస్తున్నాను. నీ దాన్ని అయినందుకు ఎంతగానో మురిసిపోయాను. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్ యూ. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. నేను ఎల్లప్పుడూ నీ దానినే.. బెల్లా మియా. నిన్నటి కంటే ఎక్కువగా నేడు.. నేటి కంటే రేపు మరింత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను’ అని రాసుకొచ్చారు. ఇటీవలే ఓ వివాహానికి హాజరయిన ఆమె తన ప్రియుడిని మిస్సవుతోన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. ‘ఈ వారాంతంలో నన్ను నేను చిరునవ్వుతో సిద్ధం చేసుకొని నా మిత్రుని సోదరి వివాహానికి హాజరయ్యాను. తేరుకొవడానికి కొద్దిగా సమయం పడుతుంది, నా వంతు కృషి చేస్తున్నాను. నేను అతన్ని చాలా ప్రేమిస్తున్నాను, మిస్ అవుతున్నాను. నేను అతన్ని ఎంతలా ఆరాధించానో, అతను కూడా నన్ను అదే రీతిలో ఆరాధించాడు’ అని ఆమె తెలిపారు. త్రిషాల సంజయ్ దత్ మొదటి కుమార్తె. 1989లో న్యూయార్క్‌లో జన్మించారు. ఆమె తల్లి రిచా శర్మ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ 1996 లో మరణించించారు. కాగా, సంజయ్‌దత్ బయోపిక్ అయిన ‘సంజూ’లో రిచా శర్మ, త్రిషాల గూర్చి ప్రస్తావించలేదు. దానిపై చాలా ఊహాగానాలు బయటకు వచ్చాయి. తన తండ్రి సంజయ్‌తో తన సంబంధం చాలా ‘సాధారణమైనది’ అని ఆమె ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఏఎమ్ఏ సెషన్లో తెలిపారు. -
‘నిన్ను కలిసే వరకూ ప్రేమిస్తూనే ఉంటాను’
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ చేసిన చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల హృదయాలను కలిచి వేస్తోంది. మరణించిన తన బాయ్‌ఫ్రెండ్‌ను తలచుకుంటూ.. ‘నీవు లేవని గుర్తుకు వస్తే నా హృదయం ముక్కలవుతుంది. నన్ను ప్రేమించినందుకు.. జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నీ రాక నా జీవితంలోకి ఎనలేని సంతోషాలు తీసుకొచ్చింది. నీ ప్రేమతో ఈ ప్రపంచంలోకెల్లా నన్ను చాలా అదృష్టవంతురాలిగా మార్చావ్. నాలో నీవు ఎన్నటికి జీవించే ఉంటావు. నిన్ను కలిసే వరకూ ప్రేమిస్తూనే ఉంటాను. నిన్నటి కంటే మిన్నగా.. నేటికంటే ఎక్కువగా.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను బెల్లా మియా’ అంటూ త్రిశాల దత్ తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే అతను ఏ కారణం వల్ల చనిపోయాడనే విషయాన్ని త్రిశాల వెల్లడించలేదు. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాల. -
ప్రియుడి మరణం; హీరో కూతురి భావోద్వేగం
బాలీవుడ్ హీరో, ‘మున్నాభాయ్’ సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ ప్రియుడు మరణించాడు. సోషల్ మీడియా వేదికగా త్రిషాల ఈ విషయాన్ని పంచుకున్నారు. ‘నా గుండె పగిలింది. నన్ను ఎంతగానో ప్రేమించినందుకు, నా గురించి శ్రద్ధ వహించినందుకు కృతఙ్ఞతలు. నా జీవితంలో ఎన్నడూ పొందనంత సంతోషాన్ని నువ్వు నాకు అందించావు. నీ ప్రేమను పొందిన కారణంగా ప్రపంచలోనే అదృష్టవంతురాలైన అమ్మాయినని భావిస్తున్నాను. నీ దాన్ని అయినందుకు ఎంతగానో మురిసిపోయాను. నువ్వు నాలో శాశ్వతంగా జీవించి ఉంటావు. ఐ లవ్ యూ. మళ్లీ నిన్ను కలుసుకునేంత వరకు.. నిన్ను ఎంతగా మిస్సవుతానో నాకు మాత్రమే తెలుసు. ఎల్లప్పుడూ నీ దానినే.. బెల్లా మియా. నిన్నటి కంటే ఎక్కువగా నేడు.. నేటి కంటే రేపటి రోజున మరింత ఎక్కువగా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని తన సోషల్ మీడియా హ్యాండిల్లో త్రిషాల భావోద్వేగపూరిత పోస్టు పెట్టారు. కాగా ఈ పోస్టులో తన ప్రియుడి పుట్టిన రోజు, మరణించిన రోజును ప్రస్తావించిన త్రిషాల అతడి గురించి మరే ఇతర విషయాలు వెల్లడించలేదు. పోస్టును బట్టి అతడు మంగళవారం చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే త్రిషాల తన ఇటాలియన్ బాయ్‌ఫ్రెండ్(మరణించిన వ్యక్తి)తో దిగిన ఫొటోలను తరచుగా పోస్ట్ చేసేవారు. ప్రస్తుత పోస్ట్ నేపథ్యంలో... ‘జీవితకాల విషాదంలో మునిగిపోయిన త్రిషాల.. ఇకపై నువ్వు మరింత ధైర్యంగా పోరాడాల్సి ఉంటుందని’ అభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు. కాగా త్రిషాల దత్ సంజయ్ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే. కూతురితో సంజయ్‌కు పెద్దగా అనుబంధం లేదు. -
సమ్మర్ కోసం ఆగలేను : హీరో కూతురు
ముంబై: సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సంజయ్ దత్ కూతురు త్రిషాల దత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటో ఒకటి కుర్రకారు గుండెల్లో వేడి రాజేస్తోంది. ‘ఎండాకాలం వచ్చే వరకు ఆగలేను’ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు ఈ అమ్మడు. ‘సమ్మర్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంతకుముందు కంటే కాస్త అందంగా కనిపించొచ్చు, అందుకే ఇక వేచి ఉండలేను’ అంటూ తన ఫాలోవర్లతో షేర్ చేసుకున్నారు త్రిషాల. ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు లక్షల మంది ఫాలోవర్లు కలిగిన త్రిషాల తన ఫ్యాన్స్‌తో ఎప్పడూ అప్డేటెడ్గా ఉంటారు. దుబాయ్‌లో తన కుటుంబంతో కలిసి విహార యాత్రలో ఉన్న ఆమె స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీలో దిగిన ఈ ఫొటోలో మరింత అందంగా పోజులిచ్చారు. ఆమె తన అందంతో అభిమానులను కట్టిపడేశారు. త్రిషాల పోస్టు చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సంజు’ చిత్రం ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సంజయ్ పాత్రను రణబీర్ కపూర్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్లో రణబీర్ అచ్చం సంజయ్‌దత్ లాగానే ఉండడంతో ‘సంజు’ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. త్రిషాల దత్ సంజయ్ మొదటి భార్య రిచా శర్మ కూతురన్న విషయం తెలిసిందే. -
ఇంటర్నెట్లో హీరో కూతురి ఫోటో వైరల్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కూతురు త్రిషాల తాజా ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న ఆమె ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. ఎరుపు రంగు క్రేప్ టాప్, నల్లని బెల్ బాటమ్ దుస్తుల్లో మోస్ట్ ఎట్రాక్టివ్‌గా ఉన్న త్రిషాల నెటిజన్లను మెస్మరైజ్ చేస్తోంది. పర్ఫెక్ట్ ఫిట్నెస్తో నల్లని బ్యాగ్ పట్టుకుని త్రిషాల దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో టాప్ లిస్టులో నిలిచింది. కాగా సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల. రిచా కేన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. మోస్ట్ గ్లామరస్‌గా ఉన్న ఆమెను తమ సినిమాల ద్వారా సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయాలని చాలామంది బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గత ఏడాది కొంచెం బొద్దుగా కనిపించిన ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీ కసరత్తే చేస్తోంది. అందుకోసం కఠినమైన ఆహార నియమాలతో పాటు, మరోవైపు జిమ్‌లో వర్కౌట్స్ చేస్తోంది. ఫిట్‌నెస్‌పై ఉన్న మక్కువతో #Yamiltho #stomachdefinition #gymlife #aboutlastnight #yay #warnwaterworks #andcardio # 7daysaweek అనే హ్యాష్ ట్యాగ్స్‌తో ఈ అమ్మడు తన ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేసింది. ఈ ఫోటోకు 10,020 లైక్‌లు కూడా సొంతం చేసుకుంది. సో త్రిషాల కూడా త్వరలోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లు ఈ ఫోటోల ద్వారా ఫీలర్స్ ఇచ్చేస్తోంది. అయితే సంజయ్ దత్‌కు మాత్రం తన కూతురు సినిమా రంగంలోకి రావడం అంత ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. ఓ సందర్భంలో ఆయన 'త్రిషాల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానన్న సంజూ భాయ్ తనని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని భావించారట. మరి త్రిషాల తన పంతం నెగ్గించుకుంటుందో.. లేక తండ్రి మాట విని బుద్ధిగా చదువుకుంటుందో చూడాలి. -
కూతురి కాళ్లు విరగ్గొడతాడట
జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న భూమి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఖల్ నాయక్. అయితే ప్రస్తుతం సినిమాల కన్నా ఫ్యామిలీ లైఫే ఇంపార్టెంట్ అని భావిస్తున్న సంజయ్, ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు తన పిల్లలకు ఎదురుకావొద్దన్న ఉద్దేశంతో వారి భవిష్యత్తు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తన తాజా చిత్రం తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో నిజజీవితంలో తన పిల్లల గురించి మీడియాతో మాట్లాడాడు. సినిమాలో తన కూతురి పాత్రకు నిజజీవితంలో తన కూతురి త్రిశాలకు చాలా పోలికలున్నాయన్నా సంజయ్ దత్. 'త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అన్నాడు. తన చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానన్న సంజూ భాయ్ తనని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని భావిస్తున్నాడట. మరి త్రిశల తన పంతం నెగ్గించుకుంటుందో.. లేక తండ్రి మాట విని బుద్ధిగా చదువుకుంటుందో చూడాలి. -
అమ్మ రాసిన ఆఖరి ఉత్తరం
ముంబై: జైలు నుంచి విడుదలయ్యాక సంజయ్ దత్ తన కుటుంబసభ్యులతో గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవల సంజయ్ తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. సంజయ్ జైలు నుంచి బయటకు రావడం ఆయన కూతురు త్రిషాలకు అమిత సంతోషాన్ని కలిగించింది. త్రిషాల తల్లిదండ్రులతో తన అనుబంధాన్ని ట్విటర్లో పంచుకుంది. సంజయ్, ఆయన మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల. రిచా కేన్సర్ వ్యాధితో 33 ఏళ్ల వయసులో మరణించింది. చిన్న వయసులోనే తల్లి దూరంకావడం, తండ్రి జైలుపాలు కావడం త్రిషాలను కలచివేసింది. రిచా శర్మ చనిపోయే ముందు రాసిన ఆఖరి ఉత్తరాన్ని త్రిషాల ట్విటర్లో పోస్ట్ చేసింది. 'అందరం కలసి జీవిస్తాం. ప్రతి ఒక్కరూ ఎవరిదారి వారు చూసుకుంటారు. నేను నా దారి చూసుకున్నా. అయితే నేనూ ఎటూ దారితోచని స్థితిలోకి వెళ్లిపోయా. వెనక్కు ఎలా రావాలో? మరో అవకాశం ఉంటుందా? వీటన్నంటికీ కాలమే సమాధానం చెబుతుంది. ఎంతకాలమైనా ఎదురు చూస్తా. వెనక్కు వచ్చే దారి లేదని నా మనసుకు తెలుసు. అయినా ఇప్పటికీ ఆశ ఉంది. ఓ దైవధూతా నా కలలు ఎదురుచూస్తున్న ప్రదేశానికి నన్ను తీసుకువెళ్లు. ఎంతో జాగ్రత్తగా నాకు స్వాగతం పలుకుతారు' అని రిచా తన చివరి లేఖ రాసింది. తన తల్లి చనిపోయినపుడు ఈ ఉత్తరాన్ని చూశానని త్రిషాల నాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది. '21 సంవత్సరాల క్రితం ఈ ఉత్తరాన్ని చూశా. రైటింగ్ స్కిల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పుడు తెలుస్తోంది. జీవితం చాలా చిన్నది. అమ్మను మిస్సయ్యా' అని త్రిషాల ట్వీట్ చేసింది. రిచా మరణాంతరం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంజయ్.. మాన్యతను రెండో వివాహం చేసుకున్నాడు. -
ఆలియా వెనుక పెళ్లికొడుకుల తల్లులు...
శేఖర్ ఖేతాన్ దర్శకత్వంలోని ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రంలో పంజాబీ అమ్మాయిగా కనిపించిన ఆలియా భట్ వెనుక పెళ్లికొడుకుల తల్లులు క్యూ కడుతున్నారు. సంప్రదాయబద్ధంగా కనిపించిన ఆలియాను తమ కోడలిగా చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. నిర్మాత కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ప్రొమో కార్యక్రమంలో ఆలియా కనిపించిన తీరుకు ముచ్చటపడిన కొందరు తల్లులు ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆమె తల్లిదండ్రుల వద్ద పెళ్లి ప్రతిపాదనలు ముందుంచుతున్నారు. పెళ్లి ప్రతిపాదనలతో వచ్చేవారిని సాగనంపడానికి ఆలియా తల్లి సోనీ రజ్దాన్ నానా తంటాలు పడుతోంది. నతాలియా పోల్‌డ్యాన్స్ రామ్‌గోపాల్ వర్మ ‘డిపార్టమెంట్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూపిన నతాలియా కౌర్ త్వరలోనే జాన్ అబ్రహాం సినిమా ‘రాకీ హ్యాండ్సమ్’లో పోల్డ్యాన్స చేయనుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పోల్డ్యాన్స చేసేందుకు నతాలియా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సరైన స్టెప్పులు నేర్చుకునేందుకు పెట్టే బేడా సర్దుకుని ఇటీవలే తన స్వదేశం బ్రెజిల్‌కు పయనమైంది. తెరపై ‘మున్నాభాయ్’ కూతురు! సంజయ్‌దత్ కూతురు త్రిషాలా త్వరలోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. నటిగా సినీరంగంలోకి వచ్చేందుకు ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నా, తండ్రి సంజయ్‌దత్ ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. త్రిషాలా కూడా సినీరంగం కంటే ఫ్యాషన్ రంగంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఫ్యాషన్ నిపుణురాలు అమితా బాల్‌తో కలసి ఒక ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తొలి ప్రాజెక్టు కోసం త్రిషాలా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తిచేసింది. -
అనంతరం: మిగిలింది అనుబంధమే!
అనంతరం: సోనాక్షిసిన్హా, సోనమ్‌కపూర్, శృతీహాసన్... ఆడపిల్లకు సెక్యూరిటీ ఉండదు అని అంతా ఫీలయ్యే సినీ పరిశ్రమలోకి, హీరోలైన తమ తండ్రుల ప్రోత్సాహంతో అడుగుపెట్టిన కూతుళ్లు వీళ్లు. నిజానికి ఈ పేర్ల పక్కన త్రిశల అనే మరో పేరు కూడా ఉండాల్సి ఉంది. కానీ బాలీవుడ్ టాప్ హీరో కూతురయిన ఆమె పేరు యువతారల లిస్టులో ఇంతవరకూ చేరలేదు. మరి త్రిశల ఏం చేస్తోంది? ఆమె ప్రయాణం ఎటువైపు సాగుతోంది? తల్లి లేదు. తండ్రి ఉన్నా... అతడికీ తనకూ మధ్య తరగని దూరం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఎనిమిదేళ్ల చిన్నారి ఎలా ఆలోచిస్తుంది? ఎంత బాధపడుతుంది? సంజయ్‌దత్ కూతురు త్రిశలను అడిగితే తెలుస్తుంది... ఆ బాధ ఎలా ఉంటుందో. తల్లి రిచా బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయాక, తండ్రి ఒడిలో ఆడుకోవచ్చనుకుంది ఆ చిన్నారి. కానీ తండ్రి తన బాధ్యతలను నెరవేర్చేందుకు సిద్ధపడ్డాడే తప్ప, ఆమెను తన దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడలేదు (అలా అని త్రిశలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది). దాంతో అమ్మమ్మ ఇల్లే ఆమె ఇల్లయ్యింది. సప్త సముద్రాలకు ఆవలే ఆమె ఉండిపోయింది. తల్లిదండ్రులు లేని పిల్లలు పెంకివాళ్లవుతారని, చెడు సావాసాలకు చేరువవుతారని కూడా చెబుతారు. కానీ త్రిశలలో అలాంటి లక్షణాలు మచ్చుకు కూడా ఉండవంటారామె సన్నిహితులు. సౌమ్యంగా ఉంటుంది. సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకుంటుంది. అందరితో సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తుంది త్రిశల. ఇది ఎలా సాధ్యమయ్యిందని అడిగితే... ‘‘నాన్నా నాకిది కావాలి అంటే క్షణాల్లో నా ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం లేదు. పేరుకే సెలెబ్రిటీ కూతురిని. కానీ సెలెబ్రిటీల పిల్లలకుండే ఏ హక్కుల్నీ సంతోషాల్నీ నేను అనుభవించలేదు. అయినా నా మీద నాకు నమ్మకముంది. అందుకే సమస్యలను ఎదుర్కొంటూ ఎదగడం నేర్చుకున్నాను’ అంటుంది త్రిశల. తన తల్లి చనిపోవడంతోనే రియా పిళ్లై అనే మోడల్/నటిని పెళ్లాడాడు తండ్రి. ఆమెతో విడిపోయాక మాన్యతను మూడో భార్యగా చేసుకున్నాడు. ఇవన్నీ త్రిశల మనసుపై ఎలాంటి ప్రభావం చూపాయన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే, ఆమె ఎవరికీ తెలియనివ్వలేదు. తండ్రితో ఎప్పుడూ మంచి అనుబంధమే ఉందామెకి. అప్పుడప్పుడూ ఇండియా వస్తుంది. నాన్నతో గడుపుతుంది. మాన్యతతో స్నేహంగా ఉంటుంది. వారి పిల్లలైన షహ్రాన్, ఇక్రాలతో ఆడిపాడుతుంది. ఉన్నన్ని రోజులూ సరదాగా, సంతోషంగా గడిపి అమెరికా వెళ్లిపోతుంది... ఒంటరిగా. ఆ నిర్ణయం తనదా... తండ్రిదా? త్రిశల మొదట్లో చాలా లావుగా ఉండేది. విపరీతంగా పెరిగిన ఒళ్లు ఆమెని ఇబ్బంది పెట్టేది. ఆ అవస్థను తగ్గించుకోవాలనుకుంది. కష్టపడి వర్కవుట్లు చేసింది. ఇప్పుడు త్రిశలను చూస్తే, ఈమె ఆ త్రిశలేనా అని అనుమానం రాక మానదు. అయితే త్రిశల స్లిమ్ అవ్వడం చూసినవాళ్లు ఆమె సినిమాల్లోకి వస్తుందేమో అనుకున్నారు. సోనాక్షి, సోనమ్‌ల మాదిరి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేస్తుందేమో అనుకున్నారు. కానీ త్రిశల ఇండస్ట్రీలో అడుగుపెట్టలేదు. పెట్టనని చెప్పేసింది కూడా. దానికి కారణం తండ్రికిష్టం లేకపోవడమే అని అందరూ అంటున్నా, ఆమె మాట్లాడదు. నాన్న నో అంటే ఇక అంతే అన్నట్లు ఉండిపోతుంది. త్రిశల ఫ్యాషన్ ఐకన్లా ఉంటుంది. రకరకాల హెయిర్ స్టయిల్స్, సొంతగా డిజైన్ చేసుకునే కాస్ట్యూమ్స్, నడినెత్తి నుంచి పాదాల వరకూ ఎంత శ్రద్ధ తీసుకుంటుందో! ఆ శ్రద్ధే ఆమెను అటువైపు నడిపించింది. డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా ఫ్యాషన్ ప్రపంచంలో తన సిగ్నేచర్‌ను నిలిపేందుకు తహతహలాడుతోంది త్రిశల. ఇండియా వచ్చి సెటిలవ్వాలన్న ఆలోచన ఆమెకి లేదు. బహుశా చిన్ననాటి నుంచీ ఎదుర్కొన్న పరిస్థితులే అందుకు కారణం కావచ్చు. వాటి గురించి అడిగినా తను చెప్పదు. చిన్నగా నవ్వి తప్పుకుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే ఆమె నవ్వు వెనకాల లోతైన భావమేదో కనిపిస్తుంది. ఆ భావాన్ని చదవడంలో... ఈ సమాజం ఎప్పుడూ విఫలమవుతూనే ఉంది! - సమీర నేలపూడి