ఇంటర్‌నెట్‌లో హీరో కూతురి ఫోటో వైరల్‌ | Sanjay Dutt's daughter Trishala's Pic viral in social media | Sakshi
Sakshi News home page

సంజయ్‌ దత్‌ కూతురి ఫోటో వైరల్‌

Oct 21 2017 9:40 AM | Updated on Apr 3 2019 6:34 PM

Sanjay Dutt's daughter Trishala's Pic viral in social media - Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సంజయ్‌ దత్ కూతురు త్రిషాల తాజా ఫోటో సోషల్‌ మీడియాలో  ట్రెండ్‌ అవుతోంది.   ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్న ఆమె ఇటీవల ఇన్‌స్ట్రాగ్రామ్‌లో  పోస్ట్‌ చేసిన ఫోటో ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది. ఎరుపు రంగు క్రేప్‌ టాప్‌, నల్లని బెల్‌ బాటమ్‌ దుస్తుల్లో మోస్ట్‌ ఎట్రాక్టివ్‌గా ఉన్న త్రిషాల నెటిజన్లను మెస్మరైజ్‌ చేస్తోంది. పర్‌ఫెక్ట్‌ ఫిట్‌నెస్‌తో నల్లని బ్యాగ్‌ పట్టుకుని త్రిషాల దిగిన ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో టాప్‌ లిస్టులో నిలిచింది.

కాగా సంజయ్‌ దత్  మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిషాల. రిచా కేన్సర్ వ్యాధితో మరణించిన విషయం తెలిసిందే. మోస్ట్‌ గ్లామరస్‌గా ఉన్న ఆమెను తమ సినిమాల ద్వారా సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయాలని చాలామంది బాలీవుడ్‌ నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో గత ఏడాది కొంచెం బొద్దుగా కనిపించిన ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు భారీ కసరత్తే చేస్తోంది.  అందుకోసం కఠినమైన ఆహార నియమాలతో పాటు, మరోవైపు జిమ్లో వర్కౌట్స్‌ చేస్తోంది.  ఫిట్‌నెస్‌పై ఉన్న మక్కువతో #Yamiltho #stomachdefinition #gymlife #aboutlastnight #yay #warnwaterworks #andcardio # 7daysaweek అనే  హ్యాష్‌ ట్యాగ్స్‌తో ఈ అమ్మడు తన ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్‌ చేసింది. ఈ ఫోటోకు 10,020 లైక్‌లు కూడా సొంతం చేసుకుంది. సో త్రిషాల కూడా త్వరలోనే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అన్నట్లు ఈ ఫోటోల ద్వారా ఫీలర్స్‌ ఇచ్చేస్తోంది.

అయితే సంజయ్‌ దత్కు మాత్రం తన కూతురు సినిమా రంగంలోకి రావడం అంత ఇష్టం ఉన్నట్లు కనిపించడం లేదు. ఓ సందర్భంలో ఆయన 'త్రిషాల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తన చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానన్న సంజూ భాయ్ తనని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని భావించారట. మరి త్రిషాల తన పంతం నెగ్గించుకుంటుందో.. లేక తండ్రి మాట విని బుద్ధిగా చదువుకుంటుందో చూడాలి.

1
1/8

2
2/8

3
3/8

4
4/8

5
5/8

6
6/8

7
7/8

8
8/8

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement