ఆలియా వెనుక పెళ్లికొడుకుల తల్లులు... | Bride groom mothers make que to marriage Aaliyah Bhatt | Sakshi
Sakshi News home page

ఆలియా వెనుక పెళ్లికొడుకుల తల్లులు...

Published Wed, Jul 9 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

ఆలియా వెనుక పెళ్లికొడుకుల తల్లులు...

ఆలియా వెనుక పెళ్లికొడుకుల తల్లులు...

శేఖర్ ఖేతాన్ దర్శకత్వంలోని ‘హంప్టీ శర్మాకీ దుల్హనియా’ చిత్రంలో పంజాబీ అమ్మాయిగా కనిపించిన ఆలియా భట్ వెనుక పెళ్లికొడుకుల తల్లులు క్యూ కడుతున్నారు. సంప్రదాయబద్ధంగా కనిపించిన ఆలియాను తమ కోడలిగా చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. నిర్మాత కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ప్రొమో కార్యక్రమంలో ఆలియా కనిపించిన తీరుకు ముచ్చటపడిన కొందరు తల్లులు ఆమె ఇంటికి వెళ్లి మరీ ఆమె తల్లిదండ్రుల వద్ద పెళ్లి ప్రతిపాదనలు ముందుంచుతున్నారు. పెళ్లి ప్రతిపాదనలతో వచ్చేవారిని సాగనంపడానికి ఆలియా తల్లి సోనీ రజ్దాన్ నానా తంటాలు పడుతోంది.
 
నతాలియా పోల్‌డ్యాన్స్

రామ్‌గోపాల్ వర్మ ‘డిపార్‌‌టమెంట్’ సినిమాలో ఐటెం సాంగ్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూపిన నతాలియా కౌర్ త్వరలోనే జాన్ అబ్రహాం సినిమా ‘రాకీ హ్యాండ్‌సమ్’లో పోల్‌డ్యాన్‌‌స చేయనుంది. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో పోల్‌డ్యాన్‌‌స చేసేందుకు నతాలియా ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సరైన స్టెప్పులు నేర్చుకునేందుకు పెట్టే బేడా సర్దుకుని ఇటీవలే తన స్వదేశం బ్రెజిల్‌కు పయనమైంది.
 
 తెరపై ‘మున్నాభాయ్’ కూతురు!
 సంజయ్‌దత్ కూతురు త్రిషాలా త్వరలోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. నటిగా సినీరంగంలోకి వచ్చేందుకు ఆమెకు అన్ని అర్హతలూ ఉన్నా, తండ్రి సంజయ్‌దత్ ఈ విషయంపై పెద్దగా ఆసక్తి చూపలేదు. త్రిషాలా కూడా సినీరంగం కంటే ఫ్యాషన్ రంగంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతోంది. సిలికాన్ వ్యాలీకి చెందిన ఫ్యాషన్ నిపుణురాలు అమితా బాల్‌తో కలసి ఒక ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. తొలి ప్రాజెక్టు కోసం త్రిషాలా ఇటీవలే షూటింగ్ కూడా పూర్తిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement