
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ చేసిన చేసిన ఓ పోస్ట్ నెటిజన్ల హృదయాలను కలిచి వేస్తోంది. మరణించిన తన బాయ్‌ఫ్రెండ్‌ను తలచుకుంటూ.. ‘నీవు లేవని గుర్తుకు వస్తే నా హృదయం ముక్కలవుతుంది. నన్ను ప్రేమించినందుకు.. జాగ్రత్తగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నీ రాక నా జీవితంలోకి ఎనలేని సంతోషాలు తీసుకొచ్చింది. నీ ప్రేమతో ఈ ప్రపంచంలోకెల్లా నన్ను చాలా అదృష్టవంతురాలిగా మార్చావ్. నాలో నీవు ఎన్నటికి జీవించే ఉంటావు. నిన్ను కలిసే వరకూ ప్రేమిస్తూనే ఉంటాను. నిన్నటి కంటే మిన్నగా.. నేటికంటే ఎక్కువగా.. నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను బెల్లా మియా’ అంటూ త్రిశాల దత్ తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే అతను ఏ కారణం వల్ల చనిపోయాడనే విషయాన్ని త్రిశాల వెల్లడించలేదు. సంజయ్ దత్ మొదటి భార్య రిచా శర్మ కూతురు త్రిశాల.
Comments
Please login to add a commentAdd a comment