సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందుతున్న హీరోయిన్ సమంత. అభిమానులతో నిత్యం టచ్‌లో ఉండే ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోను జత చేసింది. ఈ ఫొటో చూడగానే ఆమె ఫ్యాన్స్ ఓ క్షణం పాటు అవాక్కయ్యారు. అందులో అంత పెద్ద వింత ఏముంది అనుకుంటున్నారా? మరేం లేదు, సామ్ సోఫాలో పడుకుంది. కాకపోతే ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అనే యువకుడి ఒడిలో కాళ్లు పెట్టుకుని మరీ రిలాక్స్ అవుతోంది. ఇతడు సామ్‌కు నాలుగేళ్లుగా స్టైలిష్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల స్నేహానికి గుర్తుగా సామ్ అతడితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీస్‌లో యాడ్ చేస్తూ ఐ లవ్‌యూ అని రాసుకొచ్చింది. (చదవండి: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?: ప్రదీప్ లిప్‌లాక్!)
కానీ ఎంత క్లోజ్ అయినా అలా ఒకరి మీద కాళ్లు పెట్టుకుని ఫొటో దిగడం అభిమానులకు అంతగా నచ్చలేదు. దీంతో సమంత చేసిన పనేమీ బాగోలేదని బాహాటంగానే విమర్శించారు. దీంతో నాలుక్కరుచుకున్న సామ్ వెంటనే ఆ ఫొటోను డిలీట్ చేసింది. కానీ అప్పటికే దాని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే సామ్ ఈ ఫొటోను ఫ్రెండ్స్ గ్రూప్‌లో షేర్ చేయబోయి స్టోరీస్‌లో యాడ్ చేసిందేమోనని ఆమె అభిమాని ఒకరు అభిప్రాయపడ్డారు. కాగా సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ఫిబ్రవరిలో విడుదల కానుంది. త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో శాంకుతలం అనే సినిమా చేయనుంది. (చదవండి: అఖిల్‌కు అంతా సెట్ చేసిన సమంత!)
Comments
Please login to add a commentAdd a comment