
సాక్షి, సిటీబ్యూరో: కాంగ్రెస్ పార్టీ చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే భార్యకు సైబర్ వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై మంగళవారం ఫిర్యాదు అందుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రాంరంభించారు. బంజారాహిల్స్ ప్రాంతంలో నివసించే మాజీ ఎమ్మెల్యే భార్య పేరుతో సోషల్ మీడియా యాప్ ఇన్‌స్ట్రాగామ్‌లో నకిలీ ఐడీని కొందరు దుండగులు క్రియేట్ చేశారు. దీనికి ప్రొఫైల్ పిక్‌గా ఆమె ఫొటోనే వినియోగించారు. ఈ ఐడీ ద్వారా ఆమే స్వయంగా పోస్టులు పెట్టినట్లు అభ్యంతరకరంగా, అసభ్యంగా కొన్ని సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఆమె స్నేహితుల, బంధువులకు వెళ్లాయి. కొందరితో ఆమె మాదిరిగా చాటింగ్ కూడా చేస్తున్నారు. ఈ విషయం ఆమె దృష్టికి రావడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మంగళవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment