
Janhvi Kapoor Shares Cryptic Post About She Has Fever: బీటౌన్‌లో కరోనా మహమ్మారి తగ్గేదే లే అంటూ వ్యాపిస్తోంది. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు కొవిడ్ బారిన పడి ఐసోలేట్ అయ్యారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సోకిందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకింది. అర్జున్ కపూర్, అన్షులా కపూర్, రియా, కరణ్ బూలానీలను కొవిడ్ పలకరించింది. తాజాగా జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఫొటోలు కొన్ని తనకు కూడా కరోనా వచ్చిందా అనే అనుమానం కలిగించేలా ఉన్నాయి. జాన్వీ మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకుని ఉన్న ఫొటో తనకు జ్వరం వచ్చినట్లుగా చెబుతోంది.
పోస్ట్‌లో 'మంచంపై పడుకుని నోటిలో థర్మామీటర్ పెట్టుకున్న జాన్వీ ఫొటో, తాను వేసిన పెయింటింగ్, ఫ్రమ్ ది సోల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ రైటర్స్ పుస్తకంలోని ఒక పేజి, తన పెంచుకునే కుక్కపిల్లకు సంబంధించిన క్యూట్ వీడియో, తన సెల్ఫీ, ఖుషీ కపూర్ పక్కన పడుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఫొటో' ఉన్నాయి. ఈ పోస్ట్‌కు 'మళ్లీ ఆ సంవత్సరపు కాలం' అని క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ కాగా ఇవి చూసిన అభిమానులు, నెటిజన్లు 'గెట్ వెల్ సూన్', 'మీరు పెయింటింగ్ చాలా బాగా వేశారు. నాకు చాలా నచ్చింది', 'ముందు బ్రష్ వేసుకోండి. తర్వాత ఫొటోలు దిగితే బాగుంటుంది' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చదవండి: బీటౌన్ బ్యూటీకి కొవిడ్.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని
Comments
Please login to add a commentAdd a comment