Trisha Latest Instagram Post: Is She Has Again Failed In Love - Sakshi
Sakshi News home page

Trisha: ప్రేమలో మరోసారి ఫెయిల్‌ అయ్యిందా?

Aug 21 2022 7:33 AM | Updated on Aug 21 2022 11:19 AM

Trisha Latest Instagram Post: Is She Has Again Failed In Love - Sakshi

సాక్షి, చెన్నై: అందమైన రూపం, చక్కని నటనా ప్రతిభ త్రిష సొంతం. అందుకే మోడలింగ్‌ రంగం నుంచి కేరీర్‌ను ప్రారంభించి మిస్‌ తమిళనాడు కీరీటాన్ని గెలుచుకుంది. 2002లో కథానాయికగా పరిచయం అయ్యి నేటికీ ఎవర్‌గ్రీన్‌ నటిగా వెలిగిపోతోంది. రెండు దశాబ్దాలుగా కథానాయకగా రాణిస్తున్న బహుభాషా నటి బ్యూటీ. తమిళం, తెలుగు, కన్నడం తదితర భాషల్లో దాదాపు అగ్ర నటులందరితోనూ నటించింది. లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అయితే వ్యక్తిగతంగా 40వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ఈమెకు ప్రేమ, పెళ్లి వంటి అంశాలు ఇంకా సెట్‌ కాలేదనే చెప్పాలి.

ఈ వ్యవహారంపై ఇంతకు ముందు నిత్యం వార్తల్లో నానింది. అప్పట్లో ఒక టాలీవుడ్‌ నటుడితో ప్రేమ వ్యవహారం నడిచిందని, ఆ తర్వాత ఆ ప్రేమ విఫలం అయిందని టాక్‌. ఆ తర్వాత వరుణ్‌ మణియన్‌ అనే సినీ నిర్మాత, వ్యాపారవేత్తతో ప్రేమ, నిశ్చితార్థం వరకు వచ్చింది. కానీ పెళ్లి పీటలు ఎక్కలేదు. ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అనే అంశాలను పక్కనపెట్టి నటనపైనే దృష్టి సారించింది. అలాంటిది మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కింది.

ఈ సంచలన నటి ఇటీవల తన ఇంస్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేసిన ఒక విషయం సంచలనంగా మారింది. అదేంటో చూద్దాం ‘వక్ర బుద్ధి కలిగిన నీలాంటి వాడితో మాట్లాడకుండటమే ఉత్తమం’అని పేర్కొంది. దీంతో అలా పేర్కొనడానికి కారణం ఏమిటి? ఎవరిని అంతగా ద్వేషిస్తోంది. ప్రేమలో మూడోసారి ఫెయిల్‌ అయ్యిందా? ఇలాంటి ప్రశ్నలు ఇటు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి.
చదవండి: సండే సినిమా: వెండితెరపై జై జవాన్‌

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement