
ముంబై: భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు బ్యాట్ పట్టుకున్నాడు. కోవిడ్–19 నిబంధనల సడలింపులతో తాను మళ్లీ గ్రౌండ్‌కు వచ్చినట్లు అతను వెల్లడించాడు. ‘మళ్లీ మైదానంలోకి రావడం బాగుంది. కొంత సేపు ఆడగలిగాను. చాలా రోజుల తర్వాత నాకు నేనే కొత్తగా కనిపించాను’ అని తన ఇన్‌స్టగ్రామ్ అకౌంట్‌లో అతను పోస్ట్ చేశాడు.