కూతుళ్లే ఉత్తమం; కితాబిచ్చిన మెగాస్టార్‌ | Amitabh Bachchan On Twitter To Share The Ad With Shweta Nanda | Sakshi
Sakshi News home page

కూతుళ్లే ఉత్తమం; కితాబిచ్చిన మెగాస్టార్‌

Published Wed, Jul 18 2018 9:21 AM | Last Updated on Wed, Jul 18 2018 12:08 PM

Amitabh Bachchan On Twitter To Share The Ad With  Shweta Nanda - Sakshi

కూతురు శ్వేతా నందాతో కలిసి అమితాబ్‌ నటించిన తొలి ప్రకటనలోని ఓ దృశ్యం

బాలీవుడ్‌ మెగస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.తాజాగా బిగ్‌ బీ చేసిన ఒక ట్వీట్‌ మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. బిగ్‌ బీ కుటుంబం నుంచి మరో వ్యక్తి ఇండస్ట్రీలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే బిగ్‌ బీ, తన కూతురు శ్వేతా నందాతో కలిసి ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో నటించారు. ప్రకటనలో కూడా అమితాబ్‌, శ్వేతా ఇద్దరూ తండ్రి కూతుళ్లుగానే నటించారు. ప్రకటన బంగారు ఆభరణాల కంపెనీకి సంబంధించినదే అయినా భిన్నంగా ఉంటుందంటున్నారు కంపెనీ అధికారులు.

ఈ ప్రకటనలో కూతురు శ్వేతాతో కలిసి నటించడం గురించి బిగ్‌ బీ తన ట్విటర్‌లో ఒక సందేశాన్ని పోస్టు చేశారు. ‘టీ 2870 నాకు చాలా భావోద్వేగమైన సమయం. దీన్ని చూసిన ప్రతిసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. కుమార్తెలు ఉండటం మంచి విషయం. కూతుళ్లు బెస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. అమితాబ్‌ ట్వీట్‌కు చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పటికే ఈ తండ్రి కూతుళ్ల ప్రకటనకు మంచి స్పందన వస్తుంది.  ప్రకటనలో వీరిద్దరి నటనను అభినందిస్తూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం బిగ్‌ బీ బాలీవుడ్‌ ప్రెస్టీజియస్‌ ప్రాజెక్ట్‌ ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. మూడు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం 2019, ఆగస్ట్‌ 15న విడుదల కానున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement