AIBOC
-
అమితాబ్ యాడ్‌పై బ్యాంకర్ల ఆగ్రహం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన ఓ యాడ్‌పై బ్యాకింగ్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ప్రముఖ బంగారు అభరణాల కంపెనీ ప్రకటనలో అమితాబ్‌తో పాటు ఆయన కూతురు శ్వేత బచ్చన్ నందా కూడా నటించారు. ఈ యాడ్ బ్యాంకింగ్ వ్యవస్థపై అపనమ్మకం కల్గించేలా ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫడరేషన్(ఏఐబీవోసీ) అభిప్రాయపడింది. ఆ కంపెనీపై దావా వేయనున్నట్టు కూడా తెలిపింది. ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా మాట్లాడుతూ.. బ్యాంకింగ్ వ్యవస్థను దెబ్బతీసేలా ఈ యాడ్ ఉందని ఆరోపించారు. వారి వాణిజ్య అవసరాల కోసం లక్షలాది మంది ప్రజల్లో అపనమ్మకం కల్గించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా ఈ ఆరోపణలను సదరు అభరణాల సంస్థ తోసిపుచ్చింది. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని పేర్కొంది. బ్యాంకర్లు చేసే ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు సౌమ్య దత్తాకు లేఖ రాశారు. -
ప్రైవేట్ బ్యాంకులకు షాక్: ఏఐబీఓసీ సంచలన డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) సంచలన డిమాండ్ చేసింది. ప్రయివేటు రంగ బ్యాంకుల్లో సంక్షోభం, వివిధ కుంభకోనాల నేపథ్యంలో దేశంలోని ప్రయివేటు బ్యాంకులను జాతీయం చేయాలంటూ డిమాండ్ చేసింది. ప్రతి ఏడాది కార్పొరేట్ సెక్టారుకు ఇస్తున్న కోట్లాది రూపాయల రుణాలను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్‌తో ముందుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఈ వ్యవహారంలో కల్పించుకోవాలని కోవాలని కోరింది. ఈ బ్యాంకులను జాతీయ చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి తోడ్పడాలని సూచించింది. అంతేకాదు జాతీయం చేయడం వలన వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశం కలుగుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఏఐబీఓసీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యంగా పార్లమెంటుకు అందించిన సమాచారం ప్రకారం గత మూడేళ్ల కాలంలో రూ.2లక్షల 41వేల కోట్ల రుణాలను రద్దు చేసిన వైనాన్ని పేర్కొన్న సంస్థ బడా బాబులు కోట్ల రూపాయల రుణాలను పొందుతున్నారు. ఫలితంగా మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటూ, ఇందుకు యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకును ఉదాహరణగా పేర్కొంది. దీంతో కుటీర పరిశ్రమలు, చిన్నసంస్థలు, రైతులు రుణాలు లభించక ఇబ్బందులు పడుతున్నారని ఏఐబీఓసీ వాదించింది. అలాగూ స్టార్ట్ అప్ సంస్థలకూడా రుణాల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఈ సందర్భంగా 1969లో 14 ప్రయివేటు బ్యాంకులను,1980లో మరో ఆరు బ్యాంకులను జాతీయం చేసిన సంగతిని గుర్తు చేసింది. -
నేడు ఏఐబీఓసీమార్చ్ టు పార్లమెంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బ్యాంకుల కన్సాలిడేషన్ (ఏకీకరణ), ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ) నేడు ‘మార్చ్ టు పార్లమెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన బాం్యకింగ్ వ్యవస్థలో పెట్టుబడిదారులు, ఎఫ్‌డీఐ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసనను చేపట్టనున్నామని ఏఐబీఓసీ జనరల్ సెక్రటరీ హర్విందర్ సింగ్ చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో 10 వేల మందికిపైగా పాల్గొంటారన్నారు.