యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్‌జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పోస్ట్‌లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది.
‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది.
స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment