స్వలింగ సంపర్కం గురించి ఈ మధ్యకాలంలో మనదేశంలో బహిరంగంగా చర్చిస్తున్నారు. భారతీయ న్యాయస్మృతిలోని ‘సెక్షన్ 377’తో పాటు మరికొన్ని సెక్షన్‌లు స్వలింగ సంపర్కం నేరమని చెబుతున్నాయి. దీంతో సంబంధిత సెక్షన్లలో మార్పులు చేయాలని ఏళ్ల తరబడి న్యాయపోరాటాలు జరగుతున్నాయి. ‘హోమోసెక్సువల్’/‘గే’/‘లెస్బియన్’గా మారడానికి కారణం హర్మోన్ల ప్రభావమని డాక్టర్లు చెప్తున్న తరుణంలో ఒక ప్రముఖ వార్త పత్రికలో వచ్చిన ప్రకటన ఇప్పుడు అందర్నీఆశ్చర్యానికి గురి చేస్తోంది.