న్యూఢిల్లీ: దేశంలో డిజిటల్ ప్రకటనలపై చేసే వ్యయాలు 2018 డిసెంబర్ నాటికి 35 శాతం వృద్ధితో రూ.13,000 కోట్లకు చేరే అవకాశం ఉందని అసోచామ్, కేపీఎంజీ సర్వే తెలిపింది. స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతూ ఉండడం, డేటా టారిఫ్‌లు తగ్గిపోవడం డిజిటల్ ప్రకటనల మార్కెట్‌ను విస్తృతం చేస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది.
ప్రస్తుతం ఈ మార్కెట్ రూ.9,800 కోట్లుగా ఉంది. 3జీ, 4జీ సేవల విస్తృత వినియోగంతో ఈ మార్కెట్ భారీగా పెరగనుందన్న అభిప్రాయాలు ఈ సర్వేలో వ్యక్తమయ్యాయి. 2016 చివరికి డిజిటల్ ప్రకటనల మార్కెట్ రూ.7,500 కోట్లుగానే ఉన్న విషయాన్ని ఈ నివేదిక గుర్తు చేసింది. 23.5 కోట్ల మంది మొబైల్స్ నుంచి ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment