న్యూఢిల్లీ: దేశీయంగా ఈ నెల తొలి పక్షం రోజుల్లో పెట్రోల్ వినియోగం ఊపందుకోగా.. డీజిల్ అమ్మకాలు నీరసించాయి. వర్షాలు డిమాండును దెబ్బతీయడంతో వరుసగా రెండో నెలలోనూ డీజిల్ విక్రయాలు మందగించాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం పారిశ్రామిక కార్యక్రమాలు మందగించడం సైతం ప్రభావం చూపింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ నెల తొలి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు నామమాత్రంగా పుంజుకున్నాయి.
ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వివరాల ప్రకారం ఈ నెల 1–15 మధ్య డీజిల్ అమ్మకాలు 5.8 శాతం క్షీణించి 2.72 మిలియన్ టన్నులకు పరిమితమయ్యాయి. అయితే ఈ ఆగస్ట్ తొలి 15 రోజులతో పోలిస్తే 1 శాతం పుంజుకున్నాయి. కాగా.. పెట్రోల్ అమ్మకాలు 1.2 శాతం పెరిగి 1.3 మిలియన్ టన్నులను తాకాయి. ఆగస్ట్ తొలి పక్షంతో పోలిస్తే 8.8 శాతం ఎగశాయి.
Comments
Please login to add a commentAdd a comment