భారత్‌లో యాపిల్ కొత్త ఐఫోన్స్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి.
న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్ కొత్త ఐఫోన్స్ 6ఎస్, 6ఎస్ ప్లస్ అమ్మకాలు ఈ నెల 16న ప్రారంభం కానున్నాయి. వీటి ధరలు రూ.62,000 నుంచి రూ.92,000 శ్రేణిలో ఉన్నాయి. ఈ కొత్త ఐఫోన్స్ 16 జీబీ, 64 జీబీ, 128 జీబీ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. దేశవ్యాప్తంగా 3,500 రిటైల్స్‌లో కొత్త ఐఫోన్స్ అమ్మకాలు జరుగుతాయని డిస్ట్రిబ్యూషన్ సంస్థ బీటెల్ టెలిటెక్ పేర్కొంది. ఐఫోన్ 6ఎస్ వేరియంట్ ధర 16 జీబీ మోడల్‌కు రూ.62,000గా, 64 జీబీ మోడల్‌కు రూ.72,000గా, 128 జీబీ మోడల్‌కు రూ.82,000గా ఉంది. ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ ధర 6ఎస్‌తో పోలిస్తే మరో రూ.10,000 అధికంగా ఉంటుంది.