సాధారణంగా యాపిల్ ఐఫోన్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో చాలామందికి వినియోగించే మొబైల్స్‌లో ఐఫోన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్స్ వాడకూడదని చైనా ఇటీవల ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎక్కువ దేశాలు చైనా వస్తువులను వినియోగించడానికి ఒకింత ఆలోచిస్తాయి. కానీ చైనా ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని నిషేదించింది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది.
కొన్ని నివేదికల ప్రకారం కేవలం యాపిల్ ఐఫోన్స్ మాత్రమే వినియోగించకూడదని, ఇతర బ్రాండ్స్ గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్
భద్రత మాత్రమే కాకుండా స్వదేశీ బ్రాండ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా తరువాత యాపిల్ కంపెనీకి పెద్ద మార్కెట్ అయిన చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఐఫోన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment