అమెజాన్‌లో ఐఫోన్‌ ఫెస్ట్‌, ఆఫర్లు ఇవిగో! | iPhone Fest Is Back On Amazon | Sakshi
Sakshi News home page

అమెజాన్‌లో ఐఫోన్‌ ఫెస్ట్‌, ఆఫర్లు ఇవిగో!

Published Wed, Jun 6 2018 2:05 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

iPhone Fest Is Back On Amazon - Sakshi

న్యూఢిల్లీ : ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌, తన వెబ్‌సైట్‌లో ఐఫోన్‌ ఫెస్ట్‌కు తెరలేపింది. ఈ ఫెస్ట్‌ సందర్భంగా పలు ఆపిల్‌ ఐఫోన్‌ మోడల్స్‌పై ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే ఈ ఫోన్లను కేవలం హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఈఎంఐ లావాదేవీలపై కూడా వాలిడ్‌లో ఉంటుంది. నేటి నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్‌, జూన్‌ 12 వరకు కొనసాగుతోంది. 

ఫెస్ట్‌లో భాగంగా అందించే ఆఫర్లు...

  • ఆపిల్‌ ఐఫోన్‌ 10వ వార్షికోత్సవంగా వచ్చిన స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌పై 4,001 రూపాయల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. అదనంగా దీనిపై 4 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఇస్తోంది. అమెజాన్‌లో రూ.89వేలుగా లిస్ట్‌ అయిన ఈ ఫోన్‌, రెండు డిస్కౌంట్ల అనంతరం రూ.80,999కే అందుబాటులోకి వచ్చింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,600 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది.
  • ఐఫోన్‌ 8 ప్లస్‌, ఐఫోన్‌ 8 స్మార్ట్‌ఫోన్లపై కూడా 3 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను కస్టమర్లు పొందవచ్చు. రూ.1,001 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ అనంతరం ఐఫోన్‌ 8 ప్లస్‌ను రూ.71,999కు అమెజాన్‌ విక్రయిస్తోంది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ను పొందవచ్చు. 
  • మరోవైపు 4వేల రూపాయల డిస్కౌంట్‌ అనంతరం ఐఫోన్‌ 8 రూ.59,999కు అందుబాటులోకి వచ్చింది. దీనిపై కూడా రూ.14,600 వరకు ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.
  • ఐఫోన్‌ 7పై యూజర్లు 2 వేల రూపాయల ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను పొందనున్నారు. 45,999 రూపాయలకు విక్రయించే ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.6,371 ఫ్లాట్‌ డిస్కౌంట్‌ను అమెజాన్‌ అందిస్తోంది. ఈ ఫోన్‌పై కూడా రూ.14,600 ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

ఇలా ఐఫోన్‌ 6 ఎస్‌, ఐఫోన్‌ 6ఎస్ ప్లస్‌, ఐఫోన్‌ ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ అన్నింటిపై అమెజాన్‌ డిస్కౌంట్లను ఆఫర్‌ చేస్తోంది. పైన పేర్కొన్న ఆఫర్లతో పాటు ప్రతి కొనుగోలుపై రూ.250 అదనపు క్యాష్‌బ్యాక్‌నూ అమెజాన్‌ నేడు ఆఫర్‌ చేస్తోంది. అమెజాన్‌ ఇండియా ఐదో వార్షికోత్సవంలో భాగంగా ఈ క్యాష్‌బ్యాక్‌ను ఇస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement