మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే... | Hackers Are Threatening To Wipe Hundreds Of Millions Of iPhones: How To Protect Yourself | Sakshi
Sakshi News home page

మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే...

Published Tue, Mar 28 2017 5:00 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే... - Sakshi

మీ ఐఫోన్కు హ్యాకర్ల ముప్పుందా? అయితే...

ఎంతో సురక్షితమైన ఫోన్గా పేరుగాంచిన ఐఫోన్ కూడా హ్యాకర్ల బారిన పడుతోంది. ఇటీవలే లక్షల కొద్దీ ఐఫోన్ల డేటాను టర్కిష్ క్రైమ్ ఫ్యామిలీ హ్యాకింగ్ చేసినట్టు చెప్పుకుంటోంది. ఐక్లౌడ్.కామ్, మి.కామ్ డొమైన్ల 559 మిలియన్ల ఆపిల్ ఈ-మెయిల్ అకౌంట్ల యాక్సస్ తమ వద్ద ఉందని, 75వేల డాలర్లను బిట్ కాయిన్ రూపంలో లేదా లక్షల డాలర్ల ఐట్యూన్ గిఫ్ట్ కార్డులను తమకివ్వాలని ఆపిల్ ని బ్లాక్ మెయిల్ కూడా చేస్తోంది.  లేదంటే ఐఫోన్ల పాస్వర్డులు రీసెట్ చేస్తామని, ఫోటోలు , వీడియోలు, టెక్ట్స్ మెసేజ్లు, ఇతర వ్యక్తిగత డేటాను తొలగిస్తామని హెచ్చరిస్తోంది. కానీ  ఐఫోన్లు అసలు హ్యాకింగ్ బారినే పడలేదని వారి బ్లాక్ మెయిల్ను  ఆపిల్ కొట్టిపారేసింది. ఒకవేళ ఐఫోన్ల డేటా హ్యాకర్ల బారిన పడిన మాట నిజమైతే.. హ్యాకర్స్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి మార్గాలున్నాయట. ఏప్రిల్ 7కంటే ముందస్తుగా ఈ ప్రక్రియను పూర్తిచేసి తమ ఐఫోన్ డేటాను కాపాడుకోవాలని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
 
హ్యాకర్ల బారి నుంచి తప్పించుకునే మార్గాలు...
అధిక ఎంట్రోపీకి పాస్ వర్డ్ మార్చుకోవడం:  అధిక ఎంట్రోపీకి పాస్ వర్డును మార్చుకోవాలంట. ర్యాండమ్ నెంబర్లు, క్యాపిటల్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్లతో పాస్వర్డులను ఉంచుకోవాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. లాస్ట్ పాస్ మాదిరి పాస్ వర్డ్ మేనేజర్ ను మీరు సృష్టించుకోవచ్చట.  ఈ పాస్ వర్డ్ మేనేజర్తో ఎప్పడికప్పుడూ పాస్ వర్డ్ లను మేనేజ్ చేస్తూ ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  హై-ఎంట్రోపీ పాస్ వర్డ్ ఈ విధంగా ఉంచుకోవచ్చు. ఉదాహరణకి  1A@0z#  మాదిరి పాస్ వర్డులు పెట్టుకుంటే హ్యాకర్లు వాటిని కనుక్కోవడం కొంచెం కష్టమని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. 
 
సెక్యురిటీ ప్రశ్నలకు ఒకే మాదిరి సమాధానం లేకుండా...
సెక్యురిటీ ప్రశ్నలకు సమాధానాలు బట్టి కూడా హ్యాకర్లు తమ డేటా బేస్ ను దొంగతనం చేస్తారు. సైట్ కి సైట్ కి సెక్యురిటీప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు మార్చుకోవాలని చెబుతున్నారు. 
 
మెయిన్ నెంబర్తో కీలకడేటాను కనెక్షన్ వద్దు...
యూజర్లు తమ మెయిన్ నెంబర్ను ఈ-మెయిల్ అకౌంట్ సెక్యుర్గా పెడితే, అది హైజాకింగ్ బారిన పడే ముప్పు ఎక్కువగానే ఉందంట. మీ మెయిన్ నెంబర్ టెల్కో వద్ద ఉంటుంది. దాంతో పాటు గూగుల్ వాయిస్ కూడా మీ నెంబర్ ను మేనేజ్ చేయనప్పుడు అంత సురక్షితం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సిటివ్ అకౌంట్లకు వేరే నెంబర్లను ఇచ్చుకోవాలని అది గూగుల్ వాయిస్ నెంబర్ అయితే హ్యాకర్లు మీ అనుమతి లేకుండా ఫోన్లలోకి చొచ్చుకుని రాలేరట. ఎక్కువగా హ్యాకర్లు ఫోన్ నెంబర్లను దొంగతనం చేసే డేటాను దొంగలిస్తుంటారని టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
 
టూ-ఫ్యాక్టర్ అథన్టికేషన్: టూ-ప్యాక్టర్ అథన్టికేషన్ ను వినియోగిస్తే బారి ముప్పు నుంచి తప్పించుకోవచ్చట. ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ లేదా వాయిస్ స్కాన్ లేదా బయోమెట్రిక్ సెన్సార్ వంటి వాటిని అథన్టికేషన్ గా వినియోగించుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement