
Offers on iPhone 15 series యాపిల్ ఉత్పత్తుల విక్రయ సంస్థ యాప్‌ట్రానిక్స్ తాజాగా ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు, వాచ్‌లను దేశవ్యాప్తంగా 56 స్టోర్స్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. గుంటూరు, సిద్ధిపేట, విజయనగరం, భీమవరం తదితర నగరాల్లోని స్టోర్స్ కూడా వీటిలో ఉన్నాయి. గుంటూరు, సిద్ధిపేట స్టోర్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఐఫోన్ 14 లేదా ఐఫోన్ 13లను కొనుగోలు చేసేవారు రూ. 11,000 విలువ చేసే యాక్సెసరీలు ఉచితంగా పొందవచ్చని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటును ఎంచుకోవచ్చని తెలిపింది. అదనంగా యాపిల్‌కేర్‌ప్లస్, ప్రొటెక్ట్‌ప్లస్‌పై రూ. 2,000 మినహాయింపును, ఫోన్‌ను ఎక్సే్చంజ్ చేస్తే రూ. 6,000 వరకు బోనస్ వంటివి పొందవచ్చు. మొత్తం మీద గుంటూరు, సిద్ధిపేట కస్టమర్లు 31 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.