
బనశంకరి(బెంగళూరు): ఐఫోన్ల పార్శిల్‌తో పారిపోయిన ఇద్దరు డెలివరి బాయ్‌లను మంగళవారం కేంద్ర విభాగ సీఈఎన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 6.5 లక్షల విలువైన ఆరు ఐఫోన్లు, రెండు యాపిల్ వాచీలు, ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్స్, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 5న సుణకల్ పేటే దుకాణంలో ఆరు ఐఫోన్లు, ఒక యాపిల్ ఫోన్ తస్లీం అనే వ్యక్తి కొనుగోలు చేసి విజయనగర ఇంటి అడ్రస్‌కు పంపడానికి ఓ ఆన్‌లైన్ డెలివరిని ఆశ్రయించాడు.
అరుణ్ పాటిల్ అనే పేరుతో పార్శిల్ చేశారు. అయితే కొద్ది సమయం అనంతరం నయన్ అనే వ్యక్తి ఫోన్ చేసి పార్శిల్ తనకు అందిందని, కొద్ది నిమిషాల్లో పార్శిల్ తీసుకువస్తానని తస్లీంకు ఫోన్ చేశారు. అనంతరం ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో తస్లీం సీఈఎన్‌ను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేసి బసవరాజ, మాళప్ప అనే ఇద్దరిని అరెస్ట్ చేసి మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి Viral Video: వీడి కథేంటో.. కారు డిక్కీలో కూర్చొని డబ్బులు విసిరేస్తూ..!
Comments
Please login to add a commentAdd a comment