ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. న్యూఇయర్‌కు వెల్‌కమ్ చెబుతూ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 21 వరకు ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ప్రారంభించనుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్‌లపై భారీ ఆఫర్లకే అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఫోన్‌లతో పాటు ఇతర డివైజ్‌లను డిస్కౌంట్లకే దక్కించుకోవచ్చు.
ఆరు రోజుల పాటు జరిగే ఈ సేల్‌లో ప్లస్ మెంబర్‌షిప్ సభ్యులు ఒకరోజు ముందు నుంచి అంటే డిసెంబర్ 15 నుంచి వారికి నచ్చిన ప్రొడక్ట్‌కు కొనుగోలు చేయొచ్చు. ఇక ఈ విక్రయాల్లో అర్హులైన కష్టమర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
కొద్ది రోజుల క్రితం ఫ్లిప్ కార్ట్ బ‍్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించింది. ఆ సేల్ మిస్సైన వాళ్లు ఈ న్యూ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ పాల్గొనవచ్చు. స్మార్ట్ ఫోన్‌లతో పాటు, డిస్కౌంట్ ధరలో ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్స్, మానిటర్లు, ప్రింటర్లు సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకూ డిస్కౌంట్స్, టీవీలు, గృహోపకరణాలపై 75 శాతం వరకు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఈకామర్స్ దిగ్గజం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment