
సాక్షి, ముంబై: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డేస్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేలో ఇండియాలో లభ్యమవుతున్న ఐఫోన్లపై అదరిపోయే ఆఫర్లను అందిస్తోంది. ఐఫోన్ 14, ఐఫోన్ 13, ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 11 ఉన్నాయి. ఐఫోన్ కొనాలనుకునే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌లో నవంబర్ 20 వరకు తగ్గింపులు, ఆఫర్‌లను పొందవచ్చు
ఐఫోన్ 13
రూ.69,900కి లభించే ఐఫోన్ 13ని యాపిల్ డేస్ సేల్‌లో రూ.64,999కి కొనుగోలు చేయవచ్చు. అలాగే ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 1,500 వరకు తగ్గింపు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ యూజర్లు ఐఫోన్‌పై 5 శాతం తగ్గింపును పొందవచ్చు. 256జీబీ స్టోరేజ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లను రూ.74,999 రూ.94,999కి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 12 మినీ
ఐఫోన్ 12 మినీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 38,999కి లిస్ట్ చేసింది. 128జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌లను వరుసగా రూ.43,999 రూ.53,999కి కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 14
రూ. 79,900ల ఐఫోన్‌ను ఈ సేల్‌లో రూ.74,900కే సొంతం చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుచేసిన వినియోగదారులకు మాత్రమే ఈ తగ్గింపు లభ్యం. ఇతర కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి తగ్గింపు ఉండదు. బ్యాంక్ ఆఫర్‌తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్‌తో కలిసి దీనిపై రూ. 20వేల వరకు తగ్గింపు లభించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment