యాపిల్ ఐఫోన్ లవర్స్‌కు బంపరాఫర్. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు ప్రకటించింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్‌లో ఐఫోన్ 12,ఐఫోన్ 12మినీ, ఐఫోన్ ఎస్ తో పాటు పలు మోడళ్ల ఐఫోన్‌లపై డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ను అందిస్తున్నాయి. ఇక ఐఫోన్-13పై రూ.23వేల భారీ డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
ఐఫోన్-13 డిస్కౌంట్ ఆఫర్
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్-13 128జీబీ వేరియంట్ ధర రూ.74,900 కాగా, 256జీబీ వేరియంట్ ధర రూ.84,900, 512జీబీ వేరియంట్ ధర రూ.1,04,900గా ఉంది. అయితే ఫ్లిప్ కార్ట్ సేల్ లో డిస్కౌంట్ తో పాటు కొనుగోలుదారులు తమ పాత ఫోన్ ను ఎక్ఛేంజ్ చేస్తే రూ.18,500 వరకు ఆఫర్ పొందవచ్చు.ఈ ఎక్ఛేంజ్ ఆఫర్‌లో కొనుగోలు దారులు ఫోన్ పనితీరు, మోడల్ నంబర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ ఎక్ఛేంజ్ ధరను నిర్ణయిస్తుందని గుర్తుంచుకోవాలి.
డిస్కౌంట్,ఎక్ఛేంజ్ ఆఫర్ తర్వాత ఐఫోన్13 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.56400, 128జీబీ ఫోన్ ధర రూ.66400, 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.86400కే సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు ఫ్లిప్‌కార్ట్,యాక్సిక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లుపై 5శాతం రివార్డ్, నెలకు రూ.2560 ప్రారంభ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment