'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది' | KTR response to KCR comments | Sakshi
Sakshi News home page

'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది'

Published Sun, Jan 31 2016 12:25 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది' - Sakshi

'కేసీఆర్ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది'

హైదరాబాద్ : మున్సిపల్ శాఖను తనకిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో సాక్షితో కేటీఆర్ మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో 100కు పైగా డివిజన్లలో పర్యటించినట్లు చెప్పారు. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఒక్క అవకాశం ఇస్తే.. హైదరాబాద్ రూపు రేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని కచ్చితంగా కైవసం చేసుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేందుకు మున్సిపల్ శాఖను ఐటీ మంత్రి కేటీఆర్కి అప్పగిస్తానని శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందన తెలపాలని కేటీఆర్ను సాక్షి మీడియా కోరింది. దీంతో కేటీఆర్పై విధంగా స్పందించారు. మున్సిపల్ శాఖను ప్రస్తుతం కేసీఆరే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement