![This would be my last election ex-CM Siddaramaiah - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/30/Siddaramaiah.jpg.webp?itok=-BXs3aEG)
మైసూరు: నేను పోటీ చేసే చివరి ఎన్నికలు ఇవే. తరువాత పోటీ చేయను. రాజకీయాల నుంచి పూర్తిగా రిటైరవుతానని సీఎల్పీ నాయకుడు సిద్దరామయ్య అన్నారు. ఈ ఎన్నికలో తాను పుట్టి పెరిగిన ఊరు అయిన వరుణ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
బుధవారం మైసూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. గత శాసనసభ ఎన్నికల్లో తాను చాముండేశ్వరి నియోజకవర్గంలో పోటీ చేయగా, కొంచెం అనుమానం ఉండడంతో, బాదామిలోనూ పోటీకి దిగినట్లు చెప్పారు. ఈసారి ఎలాంటి అనుమానం లేదని, వరుణలో గెలుస్తానని అన్నారు. కాగా గత ఎన్నికలప్పుడు కూడా సిద్దరామయ్య ఇవే నా చివరి ఎన్నికలని చెప్పడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment