అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని పెంచింది. దీంతో బెంగళూరులో అపార్ట్‌మెంట్ ధరలు 10-20 శాతం పెరిగాయి. శివారు ప్రాంతాల్లోని ఇళ్ల ధరలు గరిష్ట స్థాయిలో పెరుగుదల కనిపించినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
గైడెన్స్ వ్యాల్యూ అనేది రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆస్తి విక్రయాన్ని రిజిస్ట్రేషన్ చేసే కనీస ధరను సూచిస్తుంది. దీనిని కొన్ని రాష్ట్రాల్లో సర్కిల్ రేట్ అని పిలుస్తారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ రాష్ట్ర రాజధాని బెంగళూరులోని సబర్బన్ ప్రాంతాలైన యలహంక, ఎలక్ట్రానిక్ సిటీ, కేఆర్ పురం ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
భారీగా పెరిగిన చదరపు అడుగు ధర
రాష్ట్ర ప్రభుత్వం గైడెన్స్ వ్యాల్యూని 20-30 శాతం సవరించింది. ప్రాంతాన్ని బట్టి, ఐటీ కారిడార్లలో ఇది 50 శాతానికి చేరుకోవచ్చని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ తెలిపారు. ప్రస్తుతం యలహంకలో ఒక అపార్ట్‌మెంట్ చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండేది..ఇప్పుడు అది కాస్తా రూ.11,500కి పెరిగింది. ఎలక్ట్రానిక్ సిటీలో చదరపు అడుగు గతంలో రూ.7,000 ఉండగా ఇప్పుడు రూ.10,000కు విక్రయిస్తున్నారు. కేఆర్ పురంలో అపార్ట్‌మెంట్ ఖరీదు చదరపు అడుగుకు రూ.5,500 నుంచి రూ.500-1000 పెరిగింది.
ఎంజీ రోడ్‌లో 5కిలోమీటర్ల మేర ప్రాపర్టీ ధరలు లొకేషన్ ఆధారంగా చదరపు అడుగుకు రూ. 12,000-30,000. సీబీడీ ప్రాంతంలోని ప్రధాన ప్రాంతాలలో ఒకటైన లావెల్లే రోడ్‌లో ధరలు చదరపు అడుగు రూ. 20,000-22,000 ఉండగా.. గతంలో చదరపు అడుగుకు రూ.18,000కి పెరిగాయి. ఇందిరానగర్‌లో ప్రాపర్టీ ధరలు కనీసం రూ.10,000-20,000కి చేరాయి.
సమానమైన ఇళ్ల ధరలు
బెంగళూరులోని ప్రధాన ప్రాంతాలలో మార్గదర్శక విలువ, వాస్తవ ప్రాపర్టీ ధరల మధ్య వ్యత్యాసం దాదాపు 40-50 శాతం ఉండగా..శివార్లలో ఇది దాదాపు 30 శాతం ఉందని స్థానిక రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. చాలా ప్రదేశాలలో మార్గదర్శక విలువ ఇప్పటికే మార్కెట్ విలువలో 40 శాతం కంటే తక్కువగా ఉంది. అందువల్ల, సర్కిల్ రేట్ల పెరుగుదల ప్రధాన ప్రదేశాలలో ధరలలో అంతరాన్ని తగ్గిస్తుంది. అయితే శివారు ప్రాంతాల్లో భారీ పెరుగుదల కనిపిస్తుంది అని రియల్టీ కార్ప్స్ డైరెక్టర్ సునీల్ సింగ్ తెలిపారు.
రూ.50 వేల నుంచి రూ.లక్షకి పెరిగింది
పెరిగిన గైడెన్స్ విలువ కొన్ని ప్రాంతాలలో ఇళ్లను కొనుగులో చేసే సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుందని రియాల్టీ నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎక్కువగా మధ్యతరగతి, లోయర్ ఎండ్ బడ్జెట్ గృహాలను కొనుగోలు చేయాలనుకునే వారిపై ప్రభావం చూపుతుంది. 14 శాతం పెంపు వారి ఖర్చులను రూ. 50,000 నుండి రూ. 1 లక్ష వరకు పెంచుతుంది’ అని సింగ్ పేర్కొన్నారు.
నాలుగేళ్ల క్రితం.. మళ్లీ ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల క్రితం గైడెన్స్ విలువను చివరిసారిగా పెంచింది కానీ కోవిడ్-19 సమయంలో తగ్గించింది. రెవిన్యూ శాఖ వివరాల ప్రకారం, పెరుగుదలకు ప్రధాన కారణాలలో అంతకంతకూ తరిగిపోతున్న ప్రభుత్వ ఖజానాను నింపేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని, కాబట్టే ప్రాపర్టీ గైడెన్స్ వ్యాల్యూ ధరని పెంచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment