ఆ మధ్య ఓ వ్యక్తి రెంట్ హౌస్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపు కోసం ఏకంగా తన కిడ్నీ అమ్మకానికి ఉందంటూ బెంగళూరులో ఓ పోస్టర్ అతికించిన విషయం తెలిసిందే. వాస్తవానికి తనకు బెంగళూరు ఇందిరానగర్‌లో ఓ ఇల్లు అవసరం’ అందుకే ఇళ్ల యజమానులు కనికరిస్తారేమోనని కిడ్నీ విక్రయం అంటూ పోస్టర్ అతికించి, అదే పోస్టర్‌లో తన వివరాల కోసం స్కాన్ చేయాలంటూ ఓ క్యూఆర్ కోడ్‌నూ ముద్రించడంతో సదరు వ్యక్తి సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారారు.
దీంతో పలువురు నెటిజన్లు అయ్యో పాపం అంటూ సానుభూతి చూపిస్తే.. ఇంటి ఓనర్లకు మానవత్వం లేదని మరికొందరు దుమ్మెత్తి పోశారు.
మిగిలిన ఇంటి ఓనర్ల సంగతి ఎలా ఉన్నా..యజమానులు తమ ఇంటిని అద్దెకి ఇచ్చి ఆస్తులు పోగొట్టుకుంటున్నారు. అందుకే తమ తల్లిదండ్రులే నిదర్శనమని అంటున్నారు కార్పోరేట్ ఫైనాన్స్ అడ్వైజరీ కంపెనీ క్యాపిటల్ మైండ్ సీఈవో దీపక్ షెనాయ్.
బెంగళూరులో దీపక్ షెనాయ్ తల్లిదండ్రులు ఓ వ్యక్తికి తన ఇంటిని రెంట్‌కు ఇచ్చారు. అద్దెకు ఉన్న సదరు వ్యక్తి మొదటి నెల రెంట్ సమయానికే చెల్లించాడు. మరుసటి రోజు నెల నుంచి రెంట్ చెల్లించడం మానేశాడు. ఇదే విషయంపై షెనాయ్ తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఇంతకు ముందు వేరేవాళ్లను ఇలాగే వేధించారని అతడు కూడా తిరిగి మాపై కేసు పెట్టాడు. దాదాపూ 2ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత మా ఇంటిని మేం దక్కించుకో గలిగాము’ అంటూ షెనాయ్ తన తల్లిదండ్రులకు జరిగిన చేదు అనుభవాల్ని ప్రస్తావించారు.
అంతేకాదు.. నాలుగు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఓ ఇంటి యజమాని కిరాయి దారుల నుంచి తన ఇంటిని కాపాడుకున్నారంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ కథనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Personally went through this...Mom went to the court house for two years once every two months to evict a tenant who refused to pay rent after the first month. He also filed a case saying henchmen used just like that. Had done this with other people too.
— Deepak Shenoy (@deepakshenoy) July 25, 2023
It took two years to get… https://t.co/cDTHu1DsGq
ఇక, క్యాపిటల్ మైండ్ సీఈవో తన ట్వీట్‌లో..‘పత్రికా కథనంలోని వ్యక్తికి జరిగినట్లు నాకు ఇలాగే జరిగింది. మొదటి నెల తర్వాత అద్దె చెల్లించడానికి నిరాకరించిన అద్దెదారుని ఖాళీ చేయమని అమ్మ రెండు సంవత్సరాల పాటు పోరాడింది. ఇందుకోసం ప్రతి రెండు నెలలకు ఒకసారి కోర్టుకు వెళ్లింది. మాఇంట్లో అద్దెకు ఉన్న వ్యక్తి కూడా మాపై కేసు పెట్టాడు. కోర్టులో మా కేసు తుది ఉత్తర్వులు రావడానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత అద్దెకు ఉన్న వ్యక్తిని ఇళ్లు ఖాళీ చేయించేందుకు మరో మూడు నెలలు పట్టింది. ఇక పోలీసుల సాయంతో ఇల్లు ఖాళీ చేయిద్దామని నిర్ణయించుకున్న చివరి రోజు మా ఇంట్లో కిరాయి దారు ఇల్లును ఖాళీ చేసి వెళ్లి పోయాడు.
ఇలా తన సొంత ఇంటిని కిరాయి దారుల నుంచి దక్కించుకునేందుకు మా అమ్మ ఉన్న స్థిరాస్తులన్నీ అమ్మేసి, ఇప్పుడు తనకున్న ఒకే ఒక్క ఇంటిలో నివసిస్తోంది. కాబట్టి ఇంటి ఓనర్లు కిరాయికి ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇంటిని అద్దెకి ఇచ్చి తప్పు చేయొద్దు అని కోరారు.
చదవండి👉 తెగ కొంటున్నారు : రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు అధిక గిరాకీ.. ఎక్కడంటే
Comments
Please login to add a commentAdd a comment