బెంగళూరు : కన్నడ నటుడు దర్శన్ తూగుదీప్ అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రేణుకస్వామిని దారుణంగా కొట్టి, ఎలక్ట్రిక్ షాకిచ్చి హత్య చేసినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. నిందితులు కొట్టిన దెబ్బలకు బాధితుడి అంతర్గత అవయవాలు పగిలిపోయాయి. రేణుక స్వామి మృతదేహాన్ని కాలువలో పడేసినప్పుడు అతని ముఖం సగం భాగంలో కుక్కలు పీక్కుతిన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వైద్యులు పేర్కొన్నారు.
అయితే ఈ రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు చిత్రహింసలకు గురి చేసే సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి అసభ్యకరంగా సోషల్ మీడియా పోస్ట్‌లు పెట్టారనే కారణంగా పవిత్రనే దర్శన్‌ని దాడికి ప్రేరేపించినట్లు సమాచారం.
జూన్8న రేణుక స్వామి తన స్వగ్రామమైన చిత్రదుర్గ నుంచి నిందితులు కిడ్నాప్ చేసి బెంగళూరుకు 200 కిలోమీటర్లు దూరం తరలించారు. అక్కడికి దర్శన్, పవిత్రగౌడలు వచ్చారు. అనంతరం,రేణుక స్వామిని దర్శన్, ఇతర నిందితులు ఒళ్లు జలదరించేలా హత్య చేశారు. ఆ హత్య జరిగే సమయంలో పవిత్రగౌడ అక్కడే ఉండడం గమనార్హం.
కాగా, ఈ సంచలన హత్య కేసులో పోలీసులు ఇద్దరు నటులు సహా 17 మందిని అరెస్ట్ చేశారు. హత్య కోసం దర్శన్ నిందితులకు రూ.50లక్షలు ఇచ్చినట్లు సమాచారం. ఇందులో రూ.30 లక్షలు కిడ్నాప్, హత్య, మృతదేహాన్ని మాయం చేసేందుకు సహకరించిన పవన్‌కు చెల్లించగా.. రాఘవేంద్ర, కార్తీక్‌ల కుటుంబాలకు కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లించినట్లు పలు మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment