బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్.యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది.
గురువారం కర్ణాటక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) విభాగం యడ్యూరప్ప వేధించారంటూ మైనర్‌ను ఆయనకు వ్యతిరేకంగా ఫోక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 8 కింద ప్రత్యేక కోర్టులో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. ఈ చట్ట ప్రకారం..యడ్యూరప్ప నేరం చేసినట్లు నిరూపితమైతే ఆయనకు మూడు లేదా ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే లైంగిక వేధింపుల కేసులో శుక్రవారం కర్ణాటక హైకోర్టులో యడ్యూరప్ప బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఒకరోజు ముందు అంటే ఇవాళ ఆయనపై సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం విశేషం.
యడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు
ఓ కేసులో తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు (మైనర్), ఆమె తల్లి ఫిబ్రవరిలో యడ్యూరప్పను సంపద్రించారు.ఆ సమయంలో యడ్యూరప్ప తన కూతురును లైంగికంగా వేధించారని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఆరోపణలతో మార్చి 14న బెంగళూరులోని సదాశివనగర్‌లో పోలీస్‌స్టేషన్‌లో మాజీ ముఖ్యమంత్రిపై పోలీసు కేసు నమోదైంది. ఈ విషయం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదైన కొద్ది గంటల్లో డీజీపీ అలోక్ మోహన్ కేసును దర్యాప్తు చేసేందుకు సీడీఐకి బదిలీ చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 164 కింద బాధితురాలితో పాటు ఆమె తల్లి వాంగ్మూలాన్ని సీఐడీ నమోదు చేసింది.
బాధితురాలి తల్లి మృతి.. కీలక మలుపు తిరిగిన కేసు
కేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తల్లి అనారోగ్యం కారణంగా మృతి చెందడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సీఐడీ సైతం ఈ కేసులో దూకుడు పెంచింది. మరోవైపు కర్ణాటక హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది.
ఆయన మాజీ సీఎం తొందరపడొద్దు
జూన్ 14 న జరిగిన చివరి విచారణలో యడ్యురప్ప మాజీ ముఖ్యమంత్రి. ఈ కేసు చాలా కీలమైంది. తొందరపడి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎస్ కృష్ణ దీక్షిత్‌తో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఈ కేసు విచారణకు హాజరయ్యే సమయంలోనూ ముందస్తు నోటీసు లేకుండా ఆయనను అదుపులోకి తీసుకోవద్దని స్పష్టంచేసింది. అదే సమయంలో.. విచారణకు గైర్హాజరుకాకూడదని యడియూరప్పకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలోనే ఆయన సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్
ఈ వరుస పరిణామాల నేపథ్యంలో సీఐడీ దర్యాప్తు వేగంగా సాగడం లేదని ఆరోపిస్తూ మైనర్ కుటుంబం కోర్టులోపిటిషన్ దాఖలు చేయగా, ముందస్తు బెయిల్ కోరుతూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు కేసులు శుక్రవారం (ఏప్రిల్ 26) ఒకేసారి విచారణకు రానున్నాయి.
ఎక్కడ విచారించాలో
ఒకరోజు ముందే యడ్యురప్పపై సీఐడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. సీఐడీ చార్జిషీట్ దాఖలు చేయడంతో బెంగళూరులోని ప్రత్యేక పోక్సో కోర్టులో యడ్యూరప్ప విచారణను ఎదుర్కోనున్నారు. విచారణ పోక్సో కోర్టులో జరగాలా లేక ఎంపీ/ఎమ్మెల్యేల కోసం నియమించబడిన ప్రత్యేక కోర్టులో జరగాలా అనే దానిపై కొంత గందరగోళం నెలకొందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment