![BJP MP Karadi Sanganna may join Congress - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/16/BJP%20MP%20Karadi%20Sanganna.jpg.webp?itok=4_-BLij9)
కర్ణాటక బీజేపీకి భారీ షాక్ తగిలింది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో బీజేపీకి కొప్పల్ ఎంపీ కరాడి సంగన్న గుడ్‌బై చెప్పారు. బుధవారం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాండ్య, కోలార్‌లలో పార్టీ లోక్‌సభ అభ్యర్ధుల తరుపున ప్రచారం జరపనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ కరాడి సంగన్న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
కాగా, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం సంగన్నకు మొండి చేయి చూపించింది. ఆయన బదులు బసవరాజ్ క్యావటూర్‌ను లోక్‌సభ అభ్యర్ధిగా బరిలోకి దించింది. దీంతో అలకబూనిన సంగన్న తాజాగా, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చల అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment