బీజేపికి భారీ షాక్‌.. కాం‍గ్రెస్‌ గూటికి మాజీ ముఖ్యమంత్రి? | Veteran Bjp Leader Dv Sadananda Gowda Join Congress | Sakshi
Sakshi News home page

బీజేపీకి భారీ షాక్‌.. కాం‍గ్రెస్‌ గూటికి మాజీ ముఖ్యమంత్రి?

Published Mon, Mar 18 2024 1:42 PM | Last Updated on Mon, Mar 18 2024 3:59 PM

Veteran Bjp Leader Dv Sadananda Gowda Join Congress - Sakshi

సాక్షి, బెంగళూరు : లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక బీజేపికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారిలో ఒక నేత లోక్‌ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత, మాజీ సీఎం, కేంద్ర మంత్రి డీవీ సదానంద్‌ గౌడ్‌ పార్టీకి రాజీనామా చేయనున్నారు.  

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. 224 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగిన కమలం కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్‌ 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. అయితే, త్వరలో జరగబోయే 28 లోక్‌ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుని కాంగ్రెస్‌కు చెక్‌ పెట్టాలని భావిస్తున్న కషాయ దళానికి ఆ పార్టీ నేతలు వరుసగా గుడ్‌బై చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం జయ్‌ ప్రకాష్‌ హెగ్డే 
కొద్ది రోజుల క్రితం కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, కేజే జార్జ్ సమక్షంలో బైందూరు మాజీ ఎమ్మెల్యే సుకుమార్ శెట్టి, ముదిగెరె మాజీ ఎమ్మెల్యే ఎంపీ కుమారస్వామితో పాటు కర్ణాటక ప్రభుత్వంలో కర్ణాటక బ్యాక్‌వర్డ్ క్లాస్ కమిషన్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన కోర్గి జయప్రకాష్ హెగ్డే కాంగ్రెస్‌లో చేరారు.

గతంలో ఉడిపి చిక్కమగళూరు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలపుపొందిన హెగ్డే ఈ సారి అదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. టికెట్‌ ఇచ్చే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఇప్పటికే ఆయనతో చర్చలు జరిపిందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.

మాజీ సీఎం సదానంద్‌ గౌడ సైతం
తాజాగా మాజీ సదానంద్‌ గౌడ సైతం పార్టీని వదిలి వెళ్లడంపై బీజేపీలో శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి వైసీకే వడియార్‌పై కాంగ్రెస్‌ తరుపున మైసూరు లోక్‌ సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్న సదానంద్‌ గౌడ బీజేపీకి రాజీనామా, కాంగ్రెస్‌లో చేరిక, ఏ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారని అంశాలపై మరో రెండ్రోరోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement