
ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణకు బెయిల్ లభించింది. బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
సూరజ్ రేవణ్ణ ఫామ్‌హౌజ్‌లో తనని లైంగికంగా వేధించాడని 27ఏళ్ల యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూరజ్ రేవణ్ణను అదుపులోకి తీన్నారు. విచారణ చేపట్టిన కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో సూరజ్ రేవణ్ణ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
తనపై వచ్చిన ఆరోపణలపై సూరజ్ రేవణ్ణ స్పందించాడు.ఫిర్యాదు దారుడు తన వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు రాబట్టేందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment