బెంగళూరు : అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. తాజాగా, బెంగళూరు పోలీసులు దర్శన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ప్రస్తుతం హత్య కేసులో బళ్లారీ జైల్లో ఉన్న దర్శన్ జ్యుడిషయల్ కస్టడీ సెప్టెంబర్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్శన్‌కు మరిన్ని కఠిన శిక్షలు పడేలా బెంగళూరు పోలీసులు బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని 200పైగా ఆధారాల్ని సేకరించారు. వాటిల్లో దర్శన్‌తో పాటు, ఇతర నిందితులు ధరించిన దస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ రిపోర్ట్‌లు సైతం ఉన్నాయి.
నేరం జరిగిన ప్రదేశం నుండి తీసిన ఫోటోలు, తనని కొట్ట వద్దని రేణుకా స్వామి వేడుకుంటున్న సీసీటీవీ పుటేజీతో పాటు, దాడి చేసే సమయంలో నటి పవిత్ర గౌడ చెప్పులకు అంటిన రేణుకాస్వామి రక్తపు మరకల తాలూకు ఆధారాల్ని పోలీసులు సేకరించారు. వాటిని ఛార్జ్ షీట్‌లో జత చేశారు.
పరప్పన జైలు నుంచి అగ్రహార జైలుకు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు.. పరప్పన అగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్‌ను బళ్లారి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించారు.కాగా, రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment