కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) అసభ్యకర వీడియోల విషయంలో ప్రధాని మోదీ మౌనంగా ఎందుకు ఉన్నారంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా స్పందించారు. రేవణ్ణపై కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ప్రధాని మౌనమేలా
రేవణ్ణపై వ్యవహారంపై ప్రియాంక గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కు పోతుంది. వందలాది మంది మహిళల జీవితాలను నాశనం చేశారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారా అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
అక్కడుంది మీ ప్రభుత్వమే కదా
ప్రియాంక గాంధీ ట్వీట్‌పై మంగళవారం ఉదయం అమిత్ షా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశంలోని మాతృశక్తికి మేం అండగా ఉంటాం. అయితే కాంగ్రెస్‌ను ఓ మాట అడగాలనుకుంటున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. ఇంతవరకు రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. లైంగిక వేదింపుల కేసు గురించి ప్రియాంక గాంధీ వాద్రా వారి సీఎంను, డిప్యూటీ సీఎంను అడగాలని సూచించారు.
విచారణకు బీజేపీ డిమాండ్
ఇది రాష్ట్రానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. కాబట్టే దీనిపై రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కేసులో విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు.
పరువు పోతుందంటూ
కాగా, రేవణ్ణ వేదింపులు కేసు వ్యవహారం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందంటూ పలువురు నేతలు జేడీఎస్ అధినేత దేవెగౌడకు లేఖలు రాశారు. దీంతో దేవెగౌడ ప్రజ్వల్‌ను పార్టీ నుంచి బహాష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
రేవణ్ణను రప్పిస్తాం
మరో వైపు కర్ణాటక ప్రభుత్వం ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా తిరిగి రప్పిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్ బి.కె.సింగ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల‍్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment