
సాక్షి,బళ్లారి: మంత్రులకు సిగ్గు, శరం ఉంటే అనవసర విషయాలు ప్రస్తావించకూడదని(ఒకే పెళ్లి), లేదంటే గురివింద సామెతను గుర్తుకు తెచ్చుకుని మాట్లాడాలంటూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రాష్ట్ర మంత్రులపై నిప్పులు చెరిగారు. ఆయన గురువారం కలబుర్గిలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా, మంత్రి సుధాకర్.. ‘ఏకపత్నీవ్రతుడు’ అనే విషయంపై పరోక్షంగా విమర్శలు చేయడంతో మాజీ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ మంత్రుల సీడీల విషయాన్ని జనం ఏ విధంగా చర్చించుకుంటున్నారో తెలుసుకుంటే మంచిదన్నారు.
ప్రస్తుతం విడుదలైన సీడీతో పాటు మరికొందరి సీడీలు కూడా విడుదల అవుతాయన్న భయంతోనే కోర్టుకు వెళ్లారనే విషయం మరవకూడదని కుమారస్వామి హితవు పలికారు. తప్పు చేయకపోతే ఎందుకు కోర్టుకు వెళతారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎదుటి వారి తప్పులనే చూపుతారు కాని తమ తప్పులను ఎరగరన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీజేపీ నేతల వాగ్యుద్ధాన్ని జనం ఛీత్కరించుకుంటున్నారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ జనం సమస్యలను గాలికి వదిలివేశారన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ ఎమ్మెల్యే వెంకటరావ్ నాడగౌడ ఆయనతో పాటు ఉన్నారు. కాగా కుమారస్వామి తొలుత అనితను వివాహం చేసుకున్నారు. ఆయనకు మరో భార్య రాధిక కూడా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment