లాయర్‌ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి | Advocate Deceased In Hospet Court At Karnataka | Sakshi
Sakshi News home page

లాయర్‌ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి

Feb 28 2021 9:14 AM | Updated on Feb 28 2021 4:43 PM

Advocate Deceased In Hospet Court At Karnataka - Sakshi

చప్పుడు లేకుండా వచ్చిన మనోజ్‌ మచ్చు కొడవలితో వెంకటేష్‌పై పలుమార్లు నరికాడు.

హొసపేటె: న్యాయదేవత ప్రాంగణంలో రక్తపాతం చోటుచేసుకుంది. హొసపేటెలోని సివిల్‌ జేఎంఎఫ్‌సీ కోర్టు ఆవరణలో శనివారం కాంగ్రెస్‌ నాయకుడు, న్యాయవాది తారిహళ్లి వెంకటేష్‌(48) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. మ్యాసకేరికి చెందిన వెంకటేష్‌కు– తమ్ముడి కొడుకయ్యే మనోజ్‌ (22)కి మధ్య కొద్ది నెలలుగా ఆస్తి తగదా ఉంది. వెంకటేష్‌ రోజూ మాదిరి కోర్టు ప్రాంగణానికి వచ్చి కుర్చీలో కూర్చుని నోటరీలు చూసుకుంటున్నాడు. చప్పుడు లేకుండా వచ్చిన మనోజ్‌ మచ్చు కొడవలితో వెంకటేష్‌పై పలుమార్లు నరికాడు.

మెడ, తలపై తీవ్ర గాయాలతో వెంకటేష్‌ కొద్దిసేపు విలవిలలాడి ప్రాణాలొదిలాడు.  ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. తండోపతండాలుగా జనం చేరుకున్నారు. ఇంతలో పోలీసులు చేరుకుని అక్కడ ఉన్న నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ హత్యాకాండ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వ్యాప్తి చెందాయి. 

చదవండి: రాంగ్‌ రూట్‌లో బైకర్‌.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement