Lawyer murder
-
లాయర్ దారుణ హత్య.. కోర్టు ఆవరణలో మాటువేసి
హొసపేటె: న్యాయదేవత ప్రాంగణంలో రక్తపాతం చోటుచేసుకుంది. హొసపేటెలోని సివిల్ జేఎంఎఫ్‌సీ కోర్టు ఆవరణలో శనివారం కాంగ్రెస్ నాయకుడు, న్యాయవాది తారిహళ్లి వెంకటేష్(48) దారుణ హత్యకు గురయ్యాడు. వివరాలు.. మ్యాసకేరికి చెందిన వెంకటేష్‌కు– తమ్ముడి కొడుకయ్యే మనోజ్ (22)కి మధ్య కొద్ది నెలలుగా ఆస్తి తగదా ఉంది. వెంకటేష్ రోజూ మాదిరి కోర్టు ప్రాంగణానికి వచ్చి కుర్చీలో కూర్చుని నోటరీలు చూసుకుంటున్నాడు. చప్పుడు లేకుండా వచ్చిన మనోజ్ మచ్చు కొడవలితో వెంకటేష్‌పై పలుమార్లు నరికాడు. మెడ, తలపై తీవ్ర గాయాలతో వెంకటేష్ కొద్దిసేపు విలవిలలాడి ప్రాణాలొదిలాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. తండోపతండాలుగా జనం చేరుకున్నారు. ఇంతలో పోలీసులు చేరుకుని అక్కడ ఉన్న నిందితున్ని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ హత్యాకాండ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. చదవండి: రాంగ్ రూట్లో బైకర్.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు -
న్యాయవాది దారుణ హత్య
సాక్షి, తాండూరు టౌన్ (రంగారెడ్డి): గుర్తు తెలియని వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున తాండూరు రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూరు రైల్వే స్టేషన్ రెండో ఫ్లాట్‌ఫాంపై హత్యకు గురైన ఓ వృద్ధుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం పోలీసులు గుర్తించారు. మృతుడు 70 ఏళ్ల వయసు, ముస్లిం మతానికి చెందిన వాడు. మృతుడి గొంతుకోసి, కడుపులో పలు చోట్లు కత్తిపోట్ల వల్ల చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అతని దగ్గర దొరికిన విజిటింగ్ కార్డు ఆధారంగా హతుడు కర్నూలు జిల్లాకు చెందిన ఓ న్యాయవాదిగా గుర్తించారు. కార్డు వెనుక ఉన్న రెండు ఫోన్ నంబర్లకు రైల్వే పోలీసులు ఫోన్ చేయగా ఓర్వకల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ నంబర్‌గా గుర్తించారు. అతడికి మృతుడి ఫొటో, విజిటింగ్ కార్డును వాట్సాప్ ద్వారా పంపించారు. అయితే మృతుడు తనకు తెలియదని, విజిటింగ్ కార్డుపై ఉన్న రాతను బట్టి అది బనగానపల్లికి చెందిన రాజేష్ అనే ఓ నేరస్థుడిదని చెప్పారు. రాజేష్ రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, అతడిని కోర్టుకు తరచూ తరలిస్తుండే తరుణంలో తన ఫోన్ నంబర్ విజిటింగ్ కార్డుపై రాసుకున్నట్లు కానిస్టేబుల్ చెప్పాడు. రాజేష్ మానసికస్థితి సరిగా ఉండదని, గతంలో ఇదే తరహాలో రెండు హత్యలు చేశాడని చెప్పాడు. కానిస్టేబుల్ సమాచారం మేరకు రాజేష్ నంబర్‌కు ఫోన్ చేయగా వరంగల్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా సెల్ టవర్ సిగ్నల్ చూపిస్తుందని సికింద్రాబాద్ రూరల్ రైల్వే డీఎస్పీ శ్రీనివాస్‌రావు తెలిపారు. వెంటనే రెండు టీంలను రాజేష్ కోసం పంపినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
లాయర్ హత్య కేసులో అరెస్టుల పర్వం
మదనపల్లె క్రైం: జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళా న్యాయవాది నాగజ్యోతి హత్య కేసు మిస్టరీని టూటౌన్ పోలీసులు ఎట్టికేలకు ఛేదించారు. పేరుపొందిన న్యాయవాది అయిన భర్తే యుముడై ఆమె ప్రాణాలు హరించాడని పోలీసులు తేల్చా రు. తనకు తలవంపులు తెస్తోందన్న కారణమే ఈ హత్యకు దారి తీసిందని విచారణలో గుర్తించారు. సంఘంలో తనను తలెత్తుకు తిరగనీయకుండా భార్య చేస్తుండడంతో ఆమెను ఎలాగైనా అడ్డుతొలగించు కోవాలని కిరాయి హంతకులతో అతి దారుణంగా భర్త చంపించాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సూత్రధారి అయిన న్యాయవాది జితేంద్రను ఇది వరకే పోలీసులు అదుపులోకి తీసుకోగా.., హత్యలో పాల్గొన్న మరో ఆరుగురిని మంగళవారం అరెస్టు చేశారు. వారి వివరాలను డీఎస్పీ ఎం. చిదానందరెడ్డి, సీఐ సురేష్‌కుమార్ మంగళవారం విలేకర్లకు తెలియజేశారు. వివరాలు ఇలా.. మదనపల్లె పట్టణం ఎస్బీఐ కాలనీలో ఉంటున్న ప్రముఖ న్యాయవాది కె. జితేంద్ర(48)తో అమ్మినేనివీధికి చెందిన నాగజ్యోతికి 23 ఏళ్లక్రితం వివాహం అయిందన్నారు. కొంత కాలనికి వీరి మధ్య కలహాలు ఏర్పడ్డాయని. అవి తారస్థాయికిచేరి విడిపోయి వేరు వేరుగా ఉంటున్నారన్నారు. ఈ క్రమంలో తారసపడినప్పుడల్లా నాగజ్యోతి భర్త జితేంద్రతో దూషణకు పాల్పడేదన్నారు. బంధువులు, స్నేహితుల మధ్య కూడా కించపరచడంతో పాటు తనకు తలవంపులు తెచ్చిందని భర్త తీవ్ర మనస్థాపం చెందాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఎనిమిది నెలల క్రితం నాగజ్యోతి స్థానికంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టి భర్తను అవమాన పరిచిందన్నారు. అంతే కాకుండా ఆమె కూడా న్యాయవాది కావడంతో నిత్యం అదేకోర్టులో ఎదురుపడుతూ ఉండడం వల్ల ఆగ్రహంతో ఆయన భార్యను అంత మొందించాలని ప్రణాళిక రూపొందించారన్నారు. గతంలో ఒక కేసులో జితేంద్రను ఆశ్రయించిన ముద్దాయిల్లో కొందర్ని ప్రలోభపరిచి నాగజ్యోతి హత్యకు పథకం రచించాడని తెలిపారు. హత్యకు పథకం ఇలా.. బి.కొత్తకోట మండలానికి చెందిన మహేష్ అలియాస్ వెంకటేష్‌తో పాటు మరికొంత మంది సాయంతో రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు. ఆమె ఇంటి నుంచి కోర్టుకు వచ్చే సమయంలో కోర్టులో గంగమ్మగుడి సందులో హత్య చేయలని నిర్ధారించుకున్నారన్నారు. అయితే ఆమె కోర్టుకు ఆ దారిలో రాకపోడంతో మరో నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించి కాపుకాసి గత నెల 30న హత్య చేశారన్నారు. కాగా సోమవారం స్థానిక అమ్మ చెరువు మిట్ట చేనేతనగర్ వద్ద హత్యలో పాల్గొన్న ఆరుగురు నిందితులను అరెస్టు చేశారమన్నారు. వీరిలో బి. కొత్తకోట బందార్ల పల్లె వెంకటేష్ అలియాస్ మహేష్(28) ఉన్నాడు. ఇతడు 2017లో కురబలకోట మండలం మిట్టపల్లె వద్ద జరిగిన జంట హత్యల కేసులో నిందితుడు. అలాగే పీలేరు మండలం జాండ్లకు చెందిన నెల్లూరి హేమంత్(22), మూడే శేఖర్ నాయక్(23), పులిచర్ల మండలం కల్లూరుకు చెందిన మూర్తూరు షేక్ హుసేన్ అలియాస్ సద్దాం (22), షేక్ అస్లాం బాషా(25), దూదేకుల తన్వీర్(20) ఉన్నారు. కాగా మహిళా న్యాయవాది హత్యకేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన సీఐ సురేష్‌కుమార్, ఎస్ఐ కృష్ణయ్య, నాగేశ్వరరావుతో పాటు ప్రత్యేక బృందాలను డీఎస్పీ అభినందించారు. -
ప్రముఖ న్యాయవాది దారుణ హత్య
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం టీడీ రాయల్ అనే న్యాయవాది దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఆయనకు నరికి చంపారు. స్థానికంగా ఉన్న గాంధీ స్కూల్ సమీపంలోని ఏసీ పరికరాలు విక్రయించే షాపులో రాయల్ ఉండగా కాపు కాసిన దుండగులు ఒక్కసారిగా షాపులోకి దూసుకువచ్చి వేటకొడవళ్లతో దాడి చేశారు. రాయల్ పట్టణంలో ప్రముఖ న్యాయవాదిగా ఉన్నారు. హత్యకు గల కారణాలు తెలియారాలేదు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దుండుగుల కోసం గాలిస్తున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎగ్మూరు కోర్టులో మళ్లీ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై ఎగ్మూరు కోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు న్యాయవాది హత్యకు దారితీసిన పరిస్థితులు సద్దుమణిగేలోగా సోమవారం మళ్లీ కలకలం రేగింది. కోర్టు పనుల నిమిత్తం వచ్చిన ఇద్దరు మహిళల మధ్య ఏర్పడిన ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో గెలుపొందిన ప్యానెల్‌కు చెందిన స్టాలిన్ అనే న్యాయవాది శనివారం దారుణహత్యకు గురైన తరువాత కోర్టు ప్రాంగణం నివురుగప్పిన నిప్పులా మారిం ది. ఎన్నికలు ముగిసిన తరువాత సోమవారం తొలి పనిది నం కావడంతో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హత్యకేసులో మహిళా న్యాయవాది కూడా అరెస్ట్ కావడంతో మహిళా కానిస్టేబుళ్లను కూడా బందోబస్తుకు నియమించారు. ఇదిలా ఉండగా, మనాలికి చెందిన తమీమ్ (44) అనే మహిళ ఒక కేసు నిమిత్తం సోమవారం ఉదయం ఎగ్మూరు కోర్టుకు వచ్చింది. అదే సమయంలో సుమిత్ర (36) అనే మహిళా మరో కేసులో జామీను కోసం కోర్టుకు హాజరయింది. సుమిత్రాను చూడగానే తమీమ్ ఆమెతోపాటూ వచ్చిన మరో పదిమంది చుట్టుముట్టారు. ఆమెను గట్టిగా పట్టుకుని తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. దీంతో కోర్టు పరిసరాల్లో కలకలం రేగడంతో బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లు వారిని విడదీశారు. ఈ ఘర్షణపై తమీమ్ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని సదరు సుమిత్ర 24 మంది నుంచి తలా రూ.1.80 లక్షలు తీసుకుందని, కమిషన్ ఇస్తానని చెప్పడంతో తాను కూడా కొందరి నుంచి వసూలు చేసి డబ్బులు కట్టానని చెప్పింది. అయితే 20 మందిని కెనడాకు పంపగా అక్కడ వారెవ్వరికీ తగిన ఉద్యోగాలు దొరకలేదని తెలిపింది. దీంతో కెనడాకు వెళ్లినవారందరినీ తన సొంత ఖర్చుతో భారత్‌కు రప్పించానన్నారు. తన వారిద్వారా కట్టిన సొమ్మును తిరిగి ఇవ్వలేదని తమీమ్ పేర్కొంది. సుమిత్ర సోమవారం కోర్టుకు వస్తున్నట్లు తెలిసి ఆమె వల్ల నష్టపోయిన వారిని వెంటబెట్టుకుని వచ్చానని, అయితే సొమ్మురాబట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అడ్డుపడ్డారని ఆరోపించింది. న్యాయవాదుల విధుల బహిష్కరణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందిన ప్యానల్‌కు చెందిన న్యాయవాది స్టాలిన్ హత్యతో కోర్టు ప్రాంగణం నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేయగా, మరో 30 మంది నిందితుల కోసం గాలిస్తున్నారు. హత్యోదంతంతో ఉద్రిక్తతల నడుమ శనివారం బార్ కౌన్సిల్ ఎన్నికలు ముగిసిన తరువాత సోమవారం యథావిధిగా కోర్టు కార్యకలాపాలు ప్రారంభమయ్యూయి. అయితే అధిక సంఖ్యాక న్యాయవాదులు హతుడు స్టాలిన్‌కు శ్రద్ధాంజలి సూచకంగా తమ విధులను బహిష్కరించారు. న్యాయవాది ఇళంగోవన్ మాట్లాడుతూ, బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయని తెలిసినా పోలీసులు తగిన బందోబస్తు చేయని ఫలితంగా దారుణ హత్యకు దారితీసిందన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల ముసుగులో ఎంతోమంది క్రిమినల్స్ కోర్టు ప్రాంగణంలో సంచరిస్తున్నారని ఆరోపించారు. పూటుగా మద్యం తాగి, కోర్టు ప్రాంగణంలోనే మారణాయుధాలతో సంచరిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలని కోరారు.