Man Dies In Lightning Strike At Medchal - Sakshi
Sakshi News home page

ఏడాది క్రితం పెళ్లి..2 నెలల క్రితం బాబుకు జననం.. అంతలోనే

Published Wed, Nov 24 2021 12:54 PM | Last Updated on Wed, Nov 24 2021 1:38 PM

Newly married Man Died Due To Lightning In Medchal - Sakshi

సాక్షి, మేడ్చల్‌: పిడుగుపాటు ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఈ సంఘటన మేడ్చల్‌ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. రావల్‌కోల్‌ గ్రామానికి చెందిన చీర్ల మహేష్‌ (25)కు సొంతంగా పశువులు ఉన్నాయి. వాటిని కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం పశువులను మేపడానికి వెళ్లిన మహేష్‌కు సమీపంలో పిడుగు పడింది. దాని ధాటికి మహేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. 

గ్రామంలో విషాధచాయలు
మహేష్‌కు ఏడాది క్రితం వివాహం జరిగింది. రెండు నెలల క్రితం మగశిశువు జన్మించాడు. అంతా సాఫీగా సాగుతున్న కుటుంబంలో పిడుగుపాటు ఆ కుటుంబ సభ్యులను కుదిపేసింది. మహేష్‌ మరణ వార్తతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement