ఆర్కే బీచ్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం
Published Thu, Jul 6 2017 11:49 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM
విశాఖపట్నం: నగరంలోని ఆర్కేబీచ్‌లో దూకి దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భర్త మృతిచెందగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. గురువారం ఉదయం మద్యం మత్తులో బీచ్‌లో పడి ఉన్న మహిళను గుర్తించిన సందర్శకులు పోలీసులకు సమాచారం అందించారు. రగంలోకి దిగిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
మర్రిపాలేనికి చెందిన నారాయణరావు, రాజారమణి దంపతులు బుధవారం అర్ధరాత్రి మద్యం సేవించి సముద్రంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకోగా.. నారాయణరావు మృతిచెందాడు. రాజారమణి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement